CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆసరా పెన్షన్స్, పోడు సమస్యలను పరిష్కరించాలి :-ప్రజా పంధా నాయకులు మాచర్ల సత్యం.

Share it:

 


గుండాల ఏప్రిల్ 4(మన్యం మనుగడ) ఆసరా పెన్షన్స్, పోడు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ప్రజా పందా డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం అన్నారు. సోమవారం మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని దానిని అమలు చేయడం లేదన్నారు. నూతన ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలని కోరారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలన్నారు. మండలంలో పెద్ద మొత్తంలో పోడు వ్యవసాయదారులు ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోడు భూముల అన్నిటికీ పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి శంకరన్నా , నాయకులు శాంతయ్య ,ఈసం చంద్రయ్య, వెంకన్న , రాజు, పూనెం మంగయ్య , జగన్, కుమార్, కృష్ణ , గణేష్ , పాయం వెంకన్న , తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: