CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన దేశం బాగుపడదు.రైతుల ఉసురు తగిలి బీజేపీ ప్రభుత్వం అడ్రస్ గల్లంతు అవటం ఖాయం

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట:

  ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ రైతు దీక్షలు నిరసనలు జరిగాయి. 

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు నిరసన కార్యక్రమంలో ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పాల్గొన్నారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రబుత్వం రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా ధ్వంద వైఖరి అవలంబిస్తూ తెలంగాణ ప్రజలను అవమానించారు.

వాతావరణంతో భూమి నుండి వచ్చే వడ్ల గింజల పైన బీజేపీ రాజకీయాలు చేయడం సిగ్గు చేటు.

బీజేపీ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజులు వచ్చాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో రైతులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏమి చేసిందో చెప్పాలి అన్నారు.

తెలంగాణ ప్రజలు మేధావులు. బీజేపీ పార్టీ నాయకులు మెడలు వంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు.

వడ్ల కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గబోమని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ప్రసంగించారు. 

ఈయొక్క కార్యక్రమంలో మండల ఇంఛార్జ్ తుమ్మ మల్లారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగిరిరావు, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి,పిఎసియాస్ వైఎస్ చైర్మన్ కడబోయిన నరేంధర్, ల నర్రా శ్రీధర్ ,సిద్దంశెట్టి లక్ష్మన్ రావు,అచ్చ సత్యనారాయణ, సింగరబోయిన నర్సయ్య,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య,,మండల నాయకులు,చిట్టిమల్ల సమ్మయ్య, హరిబాబు,కుంట ఏడుకొండలు, కర్రీ శ్యాంబాబు,మాజీ జడ్పీటీసీ సిద్దంశెట్టి వైకుంఠం,మండవ రామకృష్ణ, భుట్టో, రాజమల్ల సుకుమార్, నిమ్మగడ్డ ప్రవీణ్,,మండల మహిళ నాయకులు,మండల యూత్ నాయకులు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: