CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి.రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ నిరసన దీక్ష.

Share it:

  మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు

మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా అశ్వాపురం మండల ,తాసిల్దార్ కార్యాలయం నందు తెలంగాణలో పండించిన వరి ధాన్యం ని కొనుగోలు చెయ్యాలి అని దీక్ష చేపట్టిన అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు కొనాలని రైతులపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. మా వడ్లు వడ్లు కావా ఆని ప్రశ్నించారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. బిజెపి ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గుచేట్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను,కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి అది కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయం తెలియకపోవడం విచారకరమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుంది,కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయి అది సహజం,దిగుబడి తగ్గుతది అందుకే ఇక్కడ బాయిల్ చేస్తాం ఆది కేంద్రంకు తెలుసునని గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇపుడు ఎందుకు వద్దు అంటున్నారు అని ప్రశ్నించారు. ఇది కక్ష్యా సాధింపు చర్య కాదా ఆని ప్రశ్నించారు.ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయెల్ ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారు,ఇది చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయండి అనటం సిగ్గుచేటన్నారు. రైతులను కించపరిచే విధంగా చాలా హీనంగా, ఘోరంగాఅవమానిస్తున్నారు.రైతులు ఎక్కడైనా రైతులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వరి వేస్తే ప్రతి గింజ కొనే బాధ్యత బిజేపిది అని బండి సంజయ్ ప్రకటించారు.రైతులకు హామీ ఇచ్చారు.ప్రతి గింజా కొంటామన్నరు.

బండి సంజయ్, కిషన్ రెడ్డి లు యసంగిలో పండించిన వడ్లను కొనల్సిందే అని, తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు వడ్లు కావా ఆని ప్రశ్నించారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుంది కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి సైతం పలు మార్లు వరి వేయమని, కొంటామని పదే పదె ప్రకటించారు,అది బాయిల్ అయిన రా-రైస్ అయిన కొంటామన్నారు.ఇపుడు మాటమార్చడం సిగ్గుచేటన్నారు. మీరు వడ్లు కొనం అనటమే సమస్య ఆని, అందుకే తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకువచ్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ వడ్లు కొనాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్ల రెడ్డి,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, మాజీ ఎంపీపీ కొల్లు మల్ల రెడ్డి, బూర్గంపాడు మార్కెట్ చైర్మన్ పొడియం ముత్యాలమ్మ సీనియర్ నాయకులు జలా రామకృష్ణారెడ్డి,కందుల కృష్ణార్జున రావు , చంచ్చు రామ్మూర్తి, ఉస అనిల్ కుమార్, మొగిళ్ళ వీరారెడ్డి, టేకుల సురేష్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు బెల్లం వెంకటేశ్వర్లు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు వెన్నె అశోక్ కుమార్, మండల టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకేల రమేష్, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,

మహిళా మండలి, యువజన విభాగం, సోషల్ మీడియా, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: