CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమరారం పంచాయతీలో రేగా జన్మదిన వేడుకల పాల్గొన్న ఎంపీటీసీ, సర్పంచ్.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం పంచాయితీలో తెలంగాణ ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదిన వేడుకలు గ్రామ అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు ల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కాయం శేఖర్ మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రేగా కాంతారావు చేస్తున్న కృషి అనిర్వచనీయం అని, ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పిస్తున్నారని, కొనియాడారు. గతంలో ఎమ్మెల్యేలు గా పనిచేసిన వారెవరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, తూతూమంత్రంగా పరిపాలన చేశారని, రేగా కాంతారావు వారికి భిన్నంగా పరిపాలన సాగిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి, సంతోషంగా అందరూ పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమరారం పంచాయతీ యూత్ కమిటీ సభ్యులు జంపయ్య, సాగర్, నాగేష్, బాబు, వాడ రాము , రమేష్, కిట్టు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: