CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మోడల్ స్కూల్ క్రీడలను ప్రారంభించిన ఏపీవో.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరునాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలో మోడల్ స్కూల్ గిరిజన క్రీడా పాఠశాల ఎంపిక లో భాగంగా మొదటిరోజు భూపాలపల్లి,ములుగు జిల్లా విద్యార్థులకు కొమురం భీం మినీ స్టేడియంలో నాలుగో తరగతి చదువుతున్న బాలురకు సామర్థ్య పరీక్షలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ ఏ పీవో వసంతరావు ఎంపీడీవో దేసీరామ్,ఎస్ ఓ.రాజ కుమార్ లు జెండా ఊపిప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారుల ఉద్దేశించి వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ క్రీడా పాఠశాల మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో నిర్వహి స్తున్నారని వారికి ప్రత్యేక క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.క్రీడల్లో పాల్గొన్న వారికి భోజనంతో పాటు ప్రత్యేకంగా కోచ్లతో శిక్షణ ఇస్తున్నారని,తెలిపారు. ఎందుకు ఎంపిక ప్రతి జిల్లాలో జరుగుతుందని,ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ఈ నెల 18 నుండి 21 వరకు పరీక్షలు కొత్తగూడెంలో నిర్వహిస్తారని ఈ క్రమంలో ములుగు జిల్లా నుండి అధిక సంఖ్యలో ఎంపిక కావాలని వారు కోరారు.చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో అవసరమని జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు.రెండవ రోజు బుధవారం కూడ ఆటలు ఉంటాయని ఆసక్తి కలిగిన విద్యార్థులు నేరుగా వచ్చి క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు భూపాలపల్లి, ములుగు పిఎం ఆర్ సి వజ్జ నారాయణ,యాలం ఆదినారా యణ,పీడీలు దేవర భాస్కర్,

గడ్డం లక్ష్మీనారాయణ,

వెంకటేష్,పీఈటీలు సునీత,

చింత సతీష్,రమేష్ వివిధ గ్రామాల నుండి 40 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: