CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉపాధి హామీ కూలీల గోసను తీర్చే దెవరు.

Share it:

 


మన్యం మనుగడ /వాజేడు:


ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఆందోళనలు జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించాలని పిలుపుమేరకు, వాజేడు మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు, ఉపాధి హామీ కూలీల వేతనాలకు అదనంగా సమ్మర్ అలవెన్స్ ను రద్దు చేస్తూ సర్కిలర్ నెం 17022 (31) ,పని ప్రదేశంలో రెండు దఫాలుగా ఫొటోలను అప్లోడ్ చేసేలా సర్కిలర్ నెం 33౩ లను ప్రభుత్వాలు జారీ చేశాయి, తక్షణమే అదనపు వేతనాల సమ్మర్ అలవెన్స్ రద్దు, పని ప్రదేశంలో ఫోటో అప్లోడ్ కొరకు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన రెండు సర్కిలర్ లను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది, దేశ వ్యాప్తంగా కూలీ రూ 257లకు పెంచిన క్యూబిక్ మీటర్ల కొలతల వలన కూలీలకు రూ 100 లు కూడా రావడం లేదని, పని ప్రదేశంలో నీడ కొరకు టెంట్, మెడికల్ కిట్టు ,త్రాగు నీరు ,ఓఆరెస్ ప్యాకేట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి, 

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గడ్డపార ,తట్ట ,కొడవలి, గొడ్డలి వంటి పని ముట్లు ఇవ్వలేదని గ్రామలలో అభివృద్ధి సాగు భూముల అభివృద్ధి పనులను నిలిపివేశారు,ఉపాది హామిలో జంగిల్(అటవీ) పనులు చేపట్టుతున్నారు,కూలీలా ప్రయాణ చార్జీలు గడ్డపార సాదన ఖర్చులు ఇవ్వడం లేదని అన్నారు.కూలీలకు ప్రమాద భీమా, ఉచ్చిత వైద్యం ,ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్ గ్రేషియా వంటివి అమలు చేయాలని కోరారు ,కరువు ప్రాంతాల ను గుర్తించి అదనపు పనులు కల్పించాలని ,మేట్లకు ట్రైనింగ్ ఇచ్చి వేతనాలు ఇవ్వాలని ఫిల్డ్ అసిస్టెంట్లను విధుల్లో కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుగిళ్ల దేవయ్య , దామోదర్ ,టిఎజిస్ నాయకులు దబ్బాకట్ల లక్ష్మయ్య ,బచ్చల క్రిష్ణబాబు, సీఐటీయూ నాయకులు కొప్పుల రఘుపతి , సుమంత్, సందీప్ , ప్రబాకర్ , మునెందర్, అల్లి సాయి బాబు పాల్గొన్నారు,

Share it:

TS

Post A Comment: