మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో మండల వాటర్ ప్లాంట్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శనివారం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల దృష్ట్యా దూర ప్రాంతాల నుండి ఎన్నో రకాల పనుల కోసం మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడానికి మండల వాటర్ ప్లాంట్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకు చల్లటి మినరల్ త్రాగు నీటిని అందించడం అభినందనీయమని అన్నారు. వేసవి కాలం పూర్తి అయ్యే వరకు చలివేంద్రాన్ని కొనసాగించి వాటర్ ప్లాంట్ యాజమాన్యం మండల ప్రజల అభిమానాన్ని పొందాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఉగాది పర్వదినం పురస్కరించుకొని మండల ప్రజలందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వాటర్ ప్లాంట్ యాజమాన్య కమిటీ సభ్యులు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, మండల రైతు బంధు సమితి కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, మండల పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: