CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా వాడవాడలా టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం చండ్రుగొండ ప్రధాన సెంటర్లో జరిగిన వేడుకల్లో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పార్టీ కోసం పని చేసే నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. తిప్పనపల్లి, పోకలగూడెం, తుంగారం,గానుగపాడు, గుర్రంగూడెం, బెండాలపాడు, మద్దుకూరు,రేపల్లెవాడ, గ్రామాలలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ గ్రామ శాఖ అధ్యక్షుడు సూర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు మేడ మోహన్ రావు,వంకాయలపాటి బాబురావు, చీదాళ్ళ పవన్ కుమార్, తిప్పన పల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించిన నాయకులు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, గుర్రంగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్మినేని చిన్న లక్ష్మయ్య టిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: