CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాజేడు లో హెల్త్ ప్రొఫైల్ సర్వే..

Share it:

 


మన్యం మనుగడ /వాజేడు.

  రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా ములుగు, జిల్లా మరో జిల్లాలో ప్రారంభించారు. ఇక అన్ని జిల్లాల్లోనూ వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని (హెల్త్‌ ప్రొఫైల్‌) సేకరిస్తారు. ఈ నేపథ్యంలో వాజేడు మండల కేంద్రంలో వైద్య సిబ్బంది 18 ఏళ్లు పైబడిన వారికి రక్త నమూనాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, యమున. జడ్పీటీసీ, తల్లడి పుష్పలత. పాల్గొని అపోహల పై అవగాహన కల్పించారు. 


వాటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ప్రతి వ్యక్తికి ఒక నంబర్‌ కేటాయిస్తారు. తద్వారా ఆన్‌లైన్‌లో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశముంటుంది. హెల్త్‌ ప్రొఫైల్‌ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు అందజేస్తారు. అని అన్నారు.


ప్రాథమికంగా రక్తనమూనాలను సేకరించి, ఈ నమూనాలను ల్యాబ్ కి పంపిస్తారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్య సమస్యల పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేశారు. సేకరించిన రక్త నమూనాలను, బీపీ, షుగర్, బ్లడ్ గ్రూప్స్, కాలేయం పరీక్ష , గుండెకు సంబంధించిన పరీక్షలు, నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేయడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ హెల్త్ ప్రొఫైల్ సర్వే. ఈ సర్వే అనంతరం ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు, పంపిణీ చేసే విధానం అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా, ఒక వేళ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే పరిష్కరించేందుకు అత్యాధునిక సాంకేతిక పరమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో వాజేడు పి.హెచ్.సి వైద్య సిబ్బంది ఆశ వర్కర్, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: