CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బాబు జగ్జివన్ రాం జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్.అశ్వాపురం యూనియన్ కార్యాలయంలో భారత దేశ మొట్ట మొదటి ఉప ప్రధానికి బాబు జగ్జివ న్ రామ్ వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ 

ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న,పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని 

భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నది.1908 ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్ బీహార్​లోని షాబాద్ జిల్లాలోని చిన్న గ్రామమైన చంద్వాలో వసంతాదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించారు. దళిత కులంలో పుట్టిన ఆయన పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు చురుకైన విద్యార్థిగా రాణించారు అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మేళాపుర సురేందర్ రెడ్డి, గంట క్రాంతి కిరణ్ రెడ్డి, కిలారు తిరుపతి రావు, మురళి, సాగర్, అరవింద్, ఉదయ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: