CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దమ్మపేట లో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా కార్యాలయం ప్రారంభం.

Share it:

  


దమ్మపేట ఏప్రిల్ 11 ( మన్యం మనుగడ ) : సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని దమ్మపేట జయలక్ష్మి సినిమా థియేటర్ వద్ద మండల కార్యాలయాన్ని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము ప్రారంభించారు

ఈ సందర్భంగా తోడం దుర్గమ్మ అధ్యక్షతన జరిగిన సభలో రాము మాట్లాడుతూ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ప్రచార కేంద్రంగా ఉపయోగపడాలని మండల ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే ఉద్యమ కేంద్రంగా ఉపయోగపడాలని అన్నారు   

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలపై భారం పడుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల వల్ల దేశంలో సామాన్య ప్రజలపై అధిక పన్నుల భారం పడిందని అన్నారు ఢిల్లీలో రైతులు సంవత్సర కాలం చేసినటువంటి రైతు ఉద్యమాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విరమించడం కోసం రైతన్నలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని అన్నారు లఖింపూర్ ఖేర్ లోమంత్రి కుమారుడు చేతిలో చనిపోయినటువంటి రైతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఎం ఎస్ పి గ్యారెంటీ చట్టం చేయాలని ,రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అన్నారు 

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహారించుకోవాలని అన్నారు

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ విద్యుత్ చార్జీలను వెంటనే విరమించుకోవాలని అన్నారు ఒక పక్క బంగారు తెలంగాణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ,పెంచి ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు 

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు ఈ రాజకీయ దొంగ నాటకాలు ఆపి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు విస్తృతంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్లపూడి శరత్ ,పీ వై ఎల్ పాల్వంచ డివిజన్ అధ్యక్షుడు కాక వెంకటేష్ ,పార్టీ మండల నాయకులు తాటి సత్యం, కుంజా కాంతారావు, కోండ్రు లక్ష్మి, వంకా నాగేష్, వగ్గెల ప్రసాద్, తెల్లం నాగేష్, తెల్లం నాగరాజు, తామ రాముడు, వాడే గిరి, చాప ముత్యాలరావు , కీసరి వెంకటేష్, కుంజా రవి, సున్నం జగన్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: