CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజ్యాంగ పరిరక్షణ యుద్ద భేరి పోస్టర్ ఆవిష్కరణ.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం కమలాపురం ఫ్యాక్టరీ ఆవరణలోఆదివారం రోజు రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరికి గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిధులు గా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు మడిపెళ్లి శ్యామ్ బాబు మాదిగ,ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఏప్రిల్ 9 న చలో హైదరాబాద్ భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ అహాంకార వైఖరిని నిరసిస్తూ అన్ని కుల సంఘాలతో జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం సార్వభౌమాత్వాన్ని, సమగ్రతనుకాపాడటానికి అన్ని కులాలు, అన్ని మతాల వారిని ఒకే ఐక్య వేదిక మీదకు తీసుకొని వచ్చి భారత రాజ్యాంగం మీద, భారత దేశ సార్వబౌమత్వం మీద దాడి చేయటానికి దుష్ట శక్తులు కాపు కాసుకొని ఉన్నాయి, అటువంటి దుష్ట శక్తుల ప్రారదోలాలి అంటే బహు జనులందరు ఏకమై ఒకే తాటిపైకి వచ్చి మన రాజ్యాంగాన్ని, మన సమగ్రతను కాపాడుకోవాలి. రాజ్యాంగం విచ్చిన్నం చేయడానికి ముందు కొంతమంది దేశ ద్రోహులు భారత రాజ్యాంగ పిత డా :బి ఆర్ అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం చేస్తున్నారు ఇది విచ్చిన్నకర శక్తుల కుట్ర, మనం అందరం ఏప్రిల్ 9 న జరిగే చలో హైదరాబాద్ రాజ్యాంగం పరిరక్షణ యుద్ధ భేరి సభకు లక్షలాదిగా తరలి వచ్చి మన ఉనికి ద్వారా మన ఐక్యతను చాటుదాం విచ్చిన్నకర శక్తుల భరతం పడదాం, యువత తరలి రావాలి మన హక్కులను కాపాడుకోవాలి అంటూ ఎమ్మార్పిఎస్, ఎం ఎస్పీ నాయకుడు సురేష్ గుగ్గిళ్ల మాదిగ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వల్లేపోగు రాము లంజపెళ్లి పున్నారావు లంజపెళ్లి ఆదినారాయణ దాసరి శ్యామ్ లాలెందరు బాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: