CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గాలి,వాన బీభత్సం, అకాల వర్షాలతో రైతులకు ఆస్తి నష్టం.

Share it:




మన్యం మనుగడ /వాజేడు:


ములుగు జిల్లా వాజేడు మండలం లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండలు భగ భగ మండిపోతుంది. సూర్యడి ఉగ్ర రూపానికి మానవాళి విలవిలలాడుతు, ఉదయం 10 గంటల సమయం వేల దాటితే కూలర్లు ఏసీ లకి పరిమితమై ఉన్న పరిస్థితులలో రైతులు, పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో

గాలి వాన బీభత్సం సృష్టించింది.

తడిసిపోయిన వరి, ధాన్యం

నేలరాలిన మామిడి,

 అకాల వర్షానికి అపార ఆస్తినష్టం జరి గింది. రోజంత 43డిడ్రీల ఉష్ణోగ్రతతో వీచిన వడ గాల్పు లతో ఉక్కిరిబిక్కిరైన మండల ప్రజలు ఒక్కసారిగా కురిసిన గాలివాన బీభత్సానికి మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


గాలి,వానకి విద్యుత్ కోతలు

.

వాజేడు మండలంలో గాలి,వాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాలలో రహదారులపై చెట్లు గాలి,వానకి విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ శాఖ వారు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.  


వరి, మిర్చి రైతుల కష్టాలు.


మండలంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు ఆరుగాలం పండించిన పంట, చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గాలివాన బీభత్సం నికి, మిర్చి రైతులు, వరి రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా, రాకుంటే ప్రభుత్వం చొరవ తీసుకొని అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. 


నేలరాలిన మామిడి.


 వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లో మామిడి పండ్లు అంటూ గ్రామల్లో ఏప్రిల్, మే, నెలలో మామిడి పండ్లు సందడి ఉంటుంది. ఈ అకాల వర్షాల వల్ల ఏడాది కాలంలో మామిడి కాయలు కుప్పలు కుప్పలుగా నేలరాలాయి. మామిడి రైతులు లబోదిబో అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నరు. మామిడి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: