CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పేదల దరికి చేరని దళిత బంధు.సామాన్యులకు అందని ద్రాక్షగానే మారేనా.

Share it:

 


  • లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం
  • దళిత బందు కోసం తెరాస,కాంగ్రెస్ నాయకుల ఎత్తుగడలు రాజీనామా డ్రామాలు
  • అంత్యోదయ పద్ధతిలో గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
  • టి ఎమ్ ఎమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివ

మన్యం మనుగడ, మంగపేట.

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద సామాన్య ప్రజలకు దళిత బంధు పథకం అందని ద్రాక్షగానే మారిందని అట్టడుగు బలహీనవర్గాల పేద ప్రజల దరికి దళిత బంధు పథకం చేరడం లేదని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివ విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకుంటూ ఆచరణలో మాత్రం దళిత అభివృద్ధిని విస్మరించిందని అన్నారు.. గత రెండు రోజులుగా ములుగు జిల్లా కు 119 మందికి దళిత బంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయంలో అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత బంధు పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేసిన విషయంలో తలెత్తుతున్న వివాదంపై తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివ స్పందించి ఆయా రాజకీయ పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దళిత సామాన్య ప్రజల పక్షం అంటూ గొప్పగా చెప్పుకునే నాయకుల్లారా....

ములుగు జిల్లా లో అట్టడుగు దళిత పేద సామాన్యులను దళిత బంధు పథకం లబ్ధిదారులు గా ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

దళిత బంధు ములుగు జిల్లా లో తెరాస లో ఉన్న దళిత నాయకులకు ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న తెరాస నాయకులారా....

ములుగు జిల్లా లో తెరాస పార్టీ మండల అధ్యక్షుడిగా దళిత బిడ్డలను ఎందుకు నియమించలేదు,

మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే అప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

తెరాస పార్టీ గ్రామ మండల పార్టీ అధ్యక్షులు జడ్పిటిసి. ఎంపీపీ, ఎంపీటీసీ,సర్పంచులు అందరూ తాడువాయి అటవి ప్రాంతంలో రహస్యంగా సమావేశమై రాజీనామా డ్రామా కి తెర లేపడం వెనుక ఆంతర్యమేమిటని అన్నారు.

మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని అన్ని సభలు సమావేశాల్లో చెప్పి రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత జాతిని మోసం చేశారని గుర్తు చేశారు.

ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఒక్క దళిత కుటుంబానికి అయినా సెంటు భూమి పంపిణీ చేశారా... మూడు ఎకరాల భూ పంపిణీ అంటూ గొప్పలు చెప్పుకుని దళిత జాతిని మోసం చేశారని అన్నారు.

1984 సంవత్సరంలో ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ ప్రాంతంలో నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వ్యాపార సముదాయానికి ప్రభుత్వం స్థలం కేటాయించింది ఇట్టి దళితుల భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేశారు కబ్జాదారులకు అండగా ఉండి కొమ్ము కాస్తూ వున్నది తెరాస పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు.చందూలాల్ మంత్రిగా ఉన్న సమయంలో వ్యాపార సముదాయం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే అడ్డుకుంది తెరాస పార్టీ నాయకులు కాదా అని వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల భూమి లో అక్రమంగా షెడ్లు నిర్మాణం చేపట్టి ఇతరులకు అద్దెకు ఇచ్చి అద్దె తీసుకుంటుంది తెరాస నాయకులు కాదా అని అన్నారు.

ఎటురూనాగారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహణ జరిగినప్పుడు ప్రజల సమక్షంలో దళితులకు కేటాయించిన వ్యాపార సముదాయం భూమిలో అక్రమంగా చొరబడిన కబ్జాదారుల ను తొలగించి 14 మంది నిరుపేద దళిత కుటుంబాలకు కేటాయించిన వ్యాపార సముదాయానికి సంబంధించిన పేద సామాన్య దళితులకు దళిత బంధు పథకం కేటాయించి దళితుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని గ్రామ సభలో తీర్మానం చేయాలని దళిత ప్రజాసంఘాలు గ్రామ సభలో వినపించినప్పటికీ అవి ఏమి పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా వ్యవహరించింది మీరు కాదా అని అన్నారు

మానస పెళ్లి శివారులో దళితులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కునే విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొనివచ్చి అమాయక దళిత బిడ్డల మీద అక్రమ కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేసింది ఎవరు అనేది ప్రజలకు తెలియదా అని అన్నారు. రానున్నది ఎన్నికల సమయం కావడంతో మరోసారి దళిత జాతి ఓట్లను దండుకోవడం కోసం దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం అంతటా తెరాస నాయకులు పంచుకున్నారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు పంచుకున్నారు అంటే అర్థం ఎటూ చూసిన రాజకీయ నాయకుల కోసమే నా ఈ యొక్క పధకాలు అసలు సిసలైన అర్హులైన నిరుపేదలకు వర్తించావా... మీ రాజకీయ పార్టీలలో జెండాలు మోసే కార్యకర్తలకు ఇస్తారా...

పథకాలన్నీ వారికేనా...

తెరాస నాయకుల మాటలలోనే వినండి...

ప్రజాధనాన్ని దళిత బంధు పేరుతో రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలకు పంచే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అన్నారు.

అట్టడుగు బలహీన నిరుపేద వర్గాలకు ఇవ్వకుండా కేవలం పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు ఆర్థికంగా బలపడిన ఉన్నత వర్గానికి చెందిన దళితులను మీ ఇష్టానుసారంగా ఎంపిక చేయడం ఏమిటి గత రెండు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేసి ఎన్నికలలో ఓటు బ్యాంకుగా వాడుకోవడం కోసం మీ రాజకీయ పార్టీల జెండాలు మోయడం కోసం 

దళిత బిడ్డలను విభజించి పాలిస్తూ దళితులను మోసం చేస్తున్నారు. దళితులందరూ ఐక్యంగా తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

కొత్తగా రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు. ములుగులో ఒక్క దళిత బిడ్డ మండల ఆద్యక్షుడుగా ఉన్నారా..గత 2 సం రాలు గా ఎస్సీ కార్పొరేషన్ ఋణాలు లేవు.

మా కార్పొరేషన్ నిధులు పక్క వాటికీ ఖర్చు చేస్తున్నారు,మా ఓట్లు కావాలి మీకు మా దళితులను విభజించి పాలన చేస్తూ మోసం చేస్తారా రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని ఈసందర్బంగా దళిత బహుజనులు అందరూ ఏకం అయి వచ్చే ఎన్నికల్లో దళిత బహుజనుల సత్తా ఏమిటో చూపించాల్సిన అవసరం వచ్చింది అని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: