CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు.ఫలిస్తున్న రేగా మంత్రం.

Share it:

 



  • దూకుడు పెంచిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో మణుగూరు ఓబి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి కార్మికులు రాజీనామా చేసి సుమారు 300 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్త కు టిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్ష అని అన్నారు.శ్రమించి పని చేసే ప్రతి కార్యకర్త కి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం,ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో,గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆయన అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుయని అన్నారు.రాష్ట్ర సర్వ ముఖ అభివృద్ధి, భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించామన్నారు.ఆసరా పింఛన్,రైతుల కోసం రైతు బందు,రైతు బీమా,24 గంటల ఉచిత కరెంట్ పేదలకోసం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,కార్యదర్శులు రామి రెడ్డి,నవీన్,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,నాయకులు,వట్టం.రాంబాబు,రామకోటి,అడపా వెంకటేశ్వర్లు,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: