CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బీసీ గురుకుల పాఠశాలకు వసతులు కల్పించాలి. బీసీ సంఘం జాతీయ నాయకుడు రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు డిమాండ్.

Share it:

 


దమ్మపేట ఏప్రిల్ 22 ( మన్యం మనుగడ ) ; అశ్వరావుపేట బీసీ బాలుర గురుకుల పాఠశాలను కొంతమంది అనాలోచితంగా గదులు సరిపోవని సౌకర్యాలు లేవని బాత్రూంల సరిపోవని సుదూర ప్రాంతం మారుమూల గ్రామమైన అన్నపురెడ్డిపల్లి గ్రామానికి తరలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే ఆ ప్రయత్నాలను విరమించుకొని ఆ పాఠశాల మంజూరు అయింది అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ఉంచాలని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వెంటనే ప్రభుత్వం యొక్క భవనాలకు నిధులు మంజూరు చేసి బీసీ గురుకుల పాఠశాల వెంటనే ప్రభుత్వ భవనాలను నిర్మించి బిసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట లో సమావేశం జరిగింది ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు లింగి శెట్టి వెంకటేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని బిసి బాలుర గురుకుల పాఠశాలను అన్నపురెడ్డిపల్లి మార్చే ప్రయత్నాలను విరమించుకోవాలని మంజూరైన అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలోనే ఉంచాలని వెంటనే దానికి పక్కా భవనాలకు నిధులు విడుదల చేసి ఇ విద్యాసంవత్సరం నుంచి జూనియర్ కళాశాలను కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంబంధిత బిసి కమిషనర్ బుర్రా వెంకటేశం కు సెక్రటరీ మల్లయ్య బట్టు కు ఆర్ సి కు వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది వెంటనే ఈ ప్రయత్నాన్ని ఆపుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి పక్కా భవనాలు నిర్మించి జూనియర్ కళాశాలలో అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలను ప్రజాప్రతినిధులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రెడ్డి మల్ల వెంకటేశ్వర రావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు లింగి శెట్టి వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి వీరంకి నాగ సుబ్బారావు మండల అధ్యక్షులు తాళం సూరిబాబు మండల యువజన అధ్యక్షులు వేముల ప్రతాప్ కార్యదర్శి కొంపల్లి బాబు రావు సొసైటీ అధ్యక్షులు చెన్నంశెట్టి సత్యనారాయణ ఆరేపల్లి రాంబాబు గట్ల క్రాంతి వీర కాంతారావు పేరు నాగబాబు రమేష్ ఎలా ప్రవీణ్ రాంబాబు ఎలపాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: