మన్యం మనుగడ, ఆంద్రప్రదేశ్:
ప్రత్తిపాడు: కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకోని నేపథ్యంలో ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆమె ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. వైకాపాకు కాకుండా ఎమ్మెల్యే పదవికి తన తల్లి రాజీనామా చేస్తున్నట్లు ఆమె కుమార్తె రిషిత నిన్న రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలో ఈరోజు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుచరిత ప్రకటించారు. పార్టీలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. వైకాపాలో ఇతర క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయొద్దని.. పార్టీకి నష్టం చేయొద్దని ఆమె సూచించారు. అయితే ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆమెకు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు.
Post A Comment: