CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

Share it:



  • ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వే కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన ఏఎన్ఎం ఆశ వర్కర్లకు ప్రశంస పత్రాలు అందించిన జిల్లా కలెక్టర్
  • ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.శబ్ద,వాయు,నీరు, కాలుష్యాలను నివారించాలి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వాతావరణ కాలుష్యం లేకుండా నీటి కాలుష్యం వాయు కాలుష్యం శబ్ద కాలు ష్యాలను నివారించాలని అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య అన్నారు.గురువారం ఏటూరు నాగారం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా వైద్య శాఖ అధికారి ఏ అప్పయ్య అధ్యక్షతన ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి అనారోగ్యానికి గురికాకుండా వాతావరణంలో ఏర్పడే కాలుష్యాలను నివారిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరు జీవించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.రాష్ట్ర

ప్రభుత్వం ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ ని ములుగు జిల్లాను ఎంపిక చేయడం చాలా సంతోష కరమని ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వే కార్య క్రమంలో మొత్తం 120 టీములు అందులో ఎక్కువగా ఉత్తమ సేవలందిస్తున్న వారికి ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వే కార్యక్రమంలో ఎక్కువ శాంపిల్స్ సేకరించి నందుకు వైద్య సిబ్బందికి ఏఎన్ఎం ఆశా వర్కర్లకు ప్రశంస పత్రాలతో పాటు నగదు బహుమతులు అందించారు.బ్రాహ్మణపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 టీమ్ లకు ప్రథమ బహుమతి 5000 శాలువా సర్టిఫికెట్ తో ఏఎన్ఎం సోమలక్ష్మి సత్కరించారు.అకినేపల్లి మల్లారం ద్వితీయ బహుమతి సీతారామమ్మ మూడు వేల రూపాయల నగదు శాలువా సర్టిఫికేట్ తో సత్కరించారు.

బోరునర్సాపూర్,మూడవ బహుమతి ఇరవై ఐదు వందలు శాలువా సర్టిఫికెట్ అదేవిధంగా రాయనిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ములుగు సబ్ సెంటర్ కృష్ణ కాలని టీంకు అనురాధ కు శాలువా సర్టిఫికెట్ అందిం చారు.మొత్తం ఐదు టీమ్ లకు బహుమతులు అందించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ సర్వే కార్య క్రమాన్ని,విజయవంతం చేయాలని గడువులోగా హెల్త్ ప్రొఫైల్ సర్వే పూర్తిచేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.జిల్లా వైద్యాధికారి ఏ అప్పయ్య ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఆవశ్యకత ను అంశాన్ని మన గ్రహం మన ఆరోగ్యం అని అభివర్ణించారు. అందుకు ప్రతి ఒక్కరు కాలుష్యాన్ని నివారించే ఆరోగ్యాలను కాపాడుకోవాలని హితవు పలికారు.ఈ కార్య క్రమంలో ఐటీడీఏ మెడికల్ ఆఫీసర్ నవీన్,నరేష్,చంద్ర శేఖర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్స్ సూపర్వైజర్ 

ఏ ఎన్ ఎం ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: