CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సెర్ప్ వివోఎ ల వేతనాలు పెంచాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా.వివొఎ లను ప్రభుత్వ ఉద్యోగులు గా ప్రమోట్ చెయ్యాలి.

Share it:


  • ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి
  • నరాటి ప్రసాద్ డిమాండ్

ములకలపల్లి:మన్యంమనుగడ ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రం లో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ లో స్వయం సహాయక సంఘాల పొదుపు గ్రూప్ లు, గ్రామీణ ప్రాంతం లోని మహిళల అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తు సెర్ఫ్ లో పనిచేస్తున్న గ్రామ దీపికాలను (వి.వొ.ఏ)ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ ఆరోపించారు.ములకలపల్లి ఐ కె పి,ఎంపీడీఓ కార్యాలయం ఎదుట

వివొఎ లు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరాటి ప్రసాద్ మాట్లాడుతూ కేవలం రోజుకి 130 రూపాయలు ఇచ్చి రోజంతా మహిళల తో అటు ప్రభుత్వం, అధికారులు వెట్టి చాకిరీ చేపిస్తున్నారని, క్రొత్త 

లోన్లు ఇప్పించాలని,లోన్ రికవరీ చెయ్యాలని అధికారులు వత్తిడి తెస్తూ గ్రామ దీపికాలను (వివొఎ)లను ఒత్తిడి చేస్తూ వీరిపై అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. టిఎ, డిఎ లు ఇవ్వకుండా ఎలా కార్యాలయంలకు, బ్యాంక్ లకు వివొఎ లు ఎలా వస్తారు అని ప్రశ్నించారు. సెల్ ఫోన్ ఇవ్వకుండా,ఆన్లైన్ చెయ్యాలని,

ఆన్లైన్ మీటింగ్ లు నిర్వహించాలని అధికారులు వత్తిడి తెస్తున్నారని తెలిపారు. గత 20 ఏళ్లుగా గ్రామదీపిక గా (వివొఏ) లు గా పనిచేస్తున్నా నేటికి వారికి ఎలాంటి పదోన్నతులు లేవని, చాలీ చాలని జీతాలతో వారికుటుంబాలను వారు ఎలా పోషించు కోవాలో, పెరిగిన ధరలతో ఎలా బ్రతకాలో చెప్పాలని ఈ సందర్బంగా నరాటి ప్రసాద్ ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు, స్పందించి గ్రామ దీపికాలను (వివోఏ) లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించి పదోన్నతులు ఇవ్వాలని,22550 వేతనం నెలకు ఇవ్వాలని,ప్రతి నెల వివోఏ ల అకౌంట్ కి వేతనాలు అందించాలని, 

పీఫ్,ఇన్సూరెన్స్,హెల్త్ కార్డ్స్, యూనిఫామ్,ఐడి కార్స్డ్,లోన్ రికవరీ కి ఇన్సెంటివ్స్ ఇవ్వలని డిమాండ్ చెస్తూ, ఎంపీడివొ చిన్న నాగేశ్వరావు కు మెమోరాండం ను అందించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సందీప్,యూసుఫ్

దాసం,కనక మహాలక్ష్మి,సురభి అదిలక్ష్మి,సఫీయా,దుర్గదేవి,రమాదేవి, పెద్దులమ్మ,కృష్ణవేణి,సత్యనారాయణ,ముదిగొండ మహాలక్ష్మి, సత్యవతి,సునీత,వివొఏ జ్యోతి, వెంకటమ్మ, సత్యవతి, నాగమణి,పుష్ప,లలిత కుమారి,రాజేశ్వరి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: