CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చీలిక వాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కండి..౼న్యూడెమోక్రసీ మధు పిలుపు.

Share it:

 



మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎదులాపురం గోపాల్ రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు ఆవునూరి మధు పాల్గొని మాట్లాడుతూ.. అనేక ఏళ్లుగా ఆదివాసీ గిరిజన, పేద రైతులు సాగుచేసుకుంటున్న పోడుభూముల ఆక్రమణ నిలుపుదల చేసి పట్టాలివ్వాలని, హరితహారం పేరుతో అక్రమంగా పోడుభూములను అక్రమించుకోవడాన్ని విరమించుకోవాలని,

నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశయాలు కల్పించాలని, పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూంలు మంజూరు చేయాలని, దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని, బొగ్గుబావుల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటికరణను నిలిపివేయాలని, ఐకెపి రుణాలు మాఫీచేసి తిరిగి నూతన రుణాలు మంజూరు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, ఆదివాసీలకు కూడా దళితబంధు లాంటి స్కీం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పార్టీలో ఏర్పడిన చీలిక కేవలం పాలక వర్గాలకు ఉపయోగ పడేదే తప్ప మరొకటి కాదని అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ ఐక్యతకోసం కృషిచేస్తే, కొందరు మాత్రం పార్టీని

నిలువునా చీల్చారని,ఈ చీలిక భక్రాన్ బీడీ కంపెనీలో చేసిన కుంభకోణాలనుండి తప్పిచుకోవడానికే తప్ప మరొకటి కాదన్నారు. ప్రజలందరూ చీలిక వాదాన్ని ఖండించాలని పిలువునిచ్చారు. అలాగే ప్రజా సమస్యలపై పార్టీ నిర్వహించే పోరాటాలలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ జనరల్ బాడీ కార్యక్రమంలో

సిపిఐ ఎంఎల్ న్యూడెవెూక్రసీ కొత్తగూడెం డివిజన్ కమిటి నాయకులు కందగట్ల సురేందర్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా నాయకులు ఎట్టి నర్సింహారావు, జూలూరుపాడు నాయకులు వల్లోజ్ రమేష్, ,

కల్తి నర్సింహరావు, పద్మ,ఏనుగు సీతయ్య, బచ్చల నాగేశ్వరావు, జాటోత్ నర్సింహరావు, కూరకూల నర్సింహరావు, జవ్వాజి నర్సింహరావు, హరిలాల్, బాలు,లక్ష్మి తదితరులు పాల్గోన్నారు.

Share it:

TS

Post A Comment: