CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలి.

Share it:


  • అఖిల భారత రైతు-కూలీ సంఘం(AIKMS) రాష్ట్ర నాయకులు మోరా రవి

మన్యం మనుగడ,పినపాక:

కేంద్రప్రభుత్వం ఢిల్లీలో రైతాంగ ఉద్యమం సమయంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోరా రవి డిమాండ్ చేశారు. మద్దతు ధర గ్యారెంటి కి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సంయుక్త కిసాన్ మోర్చా(SKM) జాతీయ కార్యవర్గం ఏప్రిల్ 11 నుండి 17 వరకు వారం రోజులు దేశవ్యాపిత ప్రచార ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానిక సమస్యలను జోడిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం పినపాక మండల కేంద్రంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోరా రవి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని దివాలా తీసే విధానాలు చేపట్టి కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. 14 నెలల పాటు దేశ రైతాంగం ఢిల్లీ సరిహద్దులకు తరలివచ్చి వీరోచితంగా పోరాడిన ఫలితంగా దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడకుండా మోసపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని విమర్శించారు ఇద్దరూ కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేసేవారే నని పేర్కొన్నారు. వరికి మద్ధతు ధర చెల్లిస్తూ వరి పంటను రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని. తునికాకు 50 ఆకుల కట్టకు మూడు రూపాయలు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని ఇతర పనులకు 30 శాతం అదనంగా ఇవ్వాలని , పోడు భూముల సాగు దారులపై ఫారెస్ట్ వారి దాడులను నిలుపుదల చేయాలని, సాగు చేస్తున్న వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని , 

 పెంచిన డీజిల్,పెట్రోల్, గ్యాస్, కరెంటు చార్జీలను తగ్గించాలని, వ్యవసాయ కూలీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించలేని ఎడల ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు బండ్ల వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, ప్రశాంత్ , గంగయ్య, సూరమ్మ ,చారి , రాజు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: