CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భీమ్ రామ్ ఆర్మీ అధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట: నేడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి పర్వదిన సందర్భంగా ఈరోజు అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్ నందు ఉన్న అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణంలో జగన్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులు అశ్వారావుపేట సిఐ బంధం ఉపేందర్ రావు, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జాతి రత్నం, ఉన్నత విద్యను అభ్యసించిన విద్యా వేత్త, ఎంఎల్సీ నుంచి దేశ ఉపప్రధానిగా కొన్ని దశాబ్దాల పాటు ప్రజా ప్రతినిదిగా దేశ ప్రజలకు అత్యున్నతమైన సేవలందించిన మహామనిషి బాబు జగ్జివన్ రామ్ అని తెలిపారు. 27 ఏళ్ల వయసులోనే బీహార్‌ శాసనమండలి సభ్యునిగా ఎన్నిక, 1935 లో హిందూ మహాసభ సమావేశాల్లో దేవాలయాలు, తాగునీటి బావులను దళితులకు తెరవాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారని అన్నారు. 1937 లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడనీ అయినప్పటికీ, నీటిపారుదల సెస్ సమస్యపై అతను తన సభ్యత్వానికి రాజీనామా చేశాడనీ, బీహార్ ప్రావిన్సియల్ లెజిస్లేచర్ లో పదిహేనుకు పదిహేను మంది ని గెలిపించిన ఘనత రావ్ దని తెలిపారు. అదే విదంగా స్వసంత్ర్య పోరాటం చేసిన అహింసా వాది అని, భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడని, అతి పిన్న వయస్సులోనే నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో 1946 చేరి “బేబి మినిష్టర్‌’ గా పిలవబడ్డ వ్యక్తిని, మొదటి భారత కేబినెట్, కార్మిక మంత్రిగా, భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేసిన ఘనత ఆయనదిని తెలిపారు. 1947 ఆగస్టు 16న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) యొక్క అంతర్జాతీయ కార్మిక సదస్సులో పాల్గొనడానికి హాజరైన ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి భారత ప్రతినిధిఅని అన్నారు. 30 ఏండ్లు,మంత్రిగా 50 ఏండ్లు,పార్లమెంట్ సభ్యుడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన ఓటమి ఎరుగని మహానేతని అన్నారు. పాకిస్థాన్ తో యుద్దంలో దేశాన్ని గెలిపించిన వ్యూహకర్త, బంగ్లాదేశ్ కు స్వసంత్రం ప్రసాదించిన రాజకీయ తత్వవేత్త, ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని ఎమర్జెన్సీ కాలం లో వ్యతిరేకించిన గొప్పా ధైర్యశాలి, చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారనీ తెలిపారు. హరిత విప్లవం తెచ్చిన అన్నదాతని కేంద్రంలో వ్యవసాయ శాఖామంత్రిగా ఆహార శాఖామంత్రిగా, కార్మిక శాఖామంత్రిగా, ఉపాధి పునరావాస మంత్రిగా, రవాణా మంత్రిగా, తంతితపాలా, రైల్వే శాఖా మంత్రిగా పలు కేబినెట్‌ హోదాల్లో అనేక పదవులు అలంకరించారని తెలిపారు. అంతటి మహనీయుడీ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు భీమ్ రామ్ ఆర్మీ సభ్యులను పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట తెరాస పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు జూపల్లి రమేష్, కార్యదర్శి వెంకన్న బాబు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, నాయకులు లక్ష్మి నరసయ్య, మందపాటి రాజ మోహన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కలపాల బాబు రావు, సత్యవరపు సంపుర్ణ, కలపాల శ్రీనివాసరావు, నార్లపాటి సుదర్శన్ రావు, చిప్పనపల్లి బజారయ్యా, గుర్రాల చెరువు సర్పంచ్ కలపాల దుర్గయ్య, బాణాల నారాయణ, మురుదుడ్ల రాంబాబు, కాంగ్రెస్ నాయకులు బూసి పాండు, తలారి జేమ్స్, తుమ్మ్మా రాంబాబు,ముల్లగిరి కృష్ణ, సీపీఐ నాయకులు సయ్యద్ సలీం, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా కార్యదర్శి ప్రభాకర్, సంఘ నాయకులు బద్దే దాసు, నార్లపాటి సత్యం, నార్లపాటీ సోమేశ్వరరావు, ఏలేటి పార్వతి,కొండపల్లి బక్కమ్మ, బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు తాళం సూరిబాబు, అంకోలు వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కట్రం స్వామిదొర, నార్లపాటి శ్రీనివాస రావు, ఎస్సీ జర్నలిస్ట్ సంఘం నాయకులు మాలోత్ రామారావు, జుజ్జారపు రాంబాబు, నైనవరపు రాజేష్ తో పాటు భీమ్ రామ్ ఆర్మీ నిర్వాహకులు గంధం ఆనంద్, నార్లపాటి మహేష్, తగరం శ్రీను, నార్లపాటి సురేష్ , నార్లపటి వెంకట్, అశోక్, తగరం సాయి, బొడ్డపాటి ఉదయ్ తగరం హరి, చిప్పనపల్లి శ్రీను, పసుపులేటి మహేష్, సీమకుర్తి సాయి, గొల్లపల్లి నాగ ధర్మరాజు, తదిరులు నాయకులు అభిమానులు యూత్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: