CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఉన్నత విద్యా శాఖ జేడీ డాక్టర్ రాజేంద్ర సింగ్.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను తెలంగాణ ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ డి.ఎస్.ఆర్ రాజేంద్ర సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల పనితీరును, అధ్యాపకుల హజరును పరిశీలించారు.తరగతుల నిర్వహణ పట్ల,సైన్స్ ల్యాబ్ ల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ కు అనేకరకాల సూచనలు,సలహాలు అందించారు.తదుపరి కళాశాల సెమినార్ హాల్లో విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ,మారుమూల గిరిజన ప్రాంతంలో నెలకొల్పబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు గిరిజన విద్యార్థులకు సేవ చేయడంలో సఫలీకృతం అయిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. కళాశాలల నిర్వహణ పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నతమైన విజయాలు నమోదు చేసిన విద్యార్థులకు ఏర్పాటు చేసే అభినందన సభ కు తాను ముఖ్య అతిథిగా హాజరవ్వాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.విద్యార్థులు జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు ద్వారా పరిశోధనాత్మకను పెంపొందించుకొవాలని సూచించారు.విద్యార్థుల్లో కృషి, పట్టుదల ఉంటే అనేక అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం కలిగిస్తోందని, ఉన్నతమైన భావాలు కలిగిన ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విద్యార్థుల కోరిక మేరకు అనేక రకాల సౌకర్యాలు కలిగించడానికి సిద్ధంగా ఉన్నారని,వీటిని విద్యార్థులు ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు.కేవలం డిగ్రీ ద్వారా అన్ని రకాలుగా స్థిరపడాలి అనే ఆలోచన కాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగ కృషి చేయాలని విద్యార్థులను కోరారు.అన్ని సందర్భాలలో ఉన్నతమైన ప్రతిభ కనబరిచి లక్ష్యాలు సాధించాలని అని కోరారు.కళాశాల అధ్యాపకు లను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులకు అవసరమైన అన్ని అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని,వారికి అవసరమైన ఉద్యోగ గైడెన్స్ ను అందించి వారి అభివృద్ధికి మనస్ఫూర్తిగా కృషి చేయాలని కోరారు.తదుపరి అధ్యాపకులు ఉన్నత విద్యాశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రాజేంద్ర సింగ్ ను ఘనంగా సత్కరించారు.తదుపరి నూతనంగా నిర్మించిన భవనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ అనురాధ, డాక్టర్ రమేష్ బాబు, భాస్కరరావు,రామ్ తిరుపతి, సాంబమూర్తి,నాగిరెడ్డి,అశోక్ శివ కుమార్,భూక్యా జబ్బార్, రవి,శరణ్య,సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: