CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం పెంచిన అధిక ధరలను నియంత్రించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ...

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం :: విద్యుత్ చార్జీలు రేట్లు తగించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ బి ఐ బ్యాంక్ నుండి ములకపడు సబ్ స్టేషన్ వరకు ధర్నా నిర్వహించారు . అనంతరం ఎలక్ట్రికల్ జె ఈ కి వినతిపత్రం అందచేశారు.ఈ ధర్నాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లంక అబ్బులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజల నిత్యవసర సరుకులు, వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ,చార్జీలు విద్యుత్ చార్జీలు, తమ ఇష్టా రీతిన పెంచి పేద మధ్య తరగతి వర్గాల పై అధిక భారాన్ని మోపడం చాలా దారుణం అని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా,రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లంక శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు సీతరమరావు,వేమనరెడ్డి, పిలక వెంకటరమణారెడ్డి, దర్శి సాంబశివరావు, రామచిట్టి,తొట్టమల్ల సుబ్బారావు,సంగీతారావు, యూత్ నాయకులు తెల్లం హరికృష్ణ, ఉబ్బ వేణు, కనుబుద్ది దేవా,తెల్లం నరేష్,లంక శివ,కణితి సమ్మయ్య, చంటి,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: