CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ వీడి తెరాస పార్టీ లోకి భారీ చేరికలు.కార్యకర్తలకు అండగా ఉంటాము.

Share it:


  • అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో 

బిఆర్ ఫంక్షన్ హాల్ నందు బుధవారం టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య లు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ములుగు జిల్లా ఆదివాసుల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఈసం రామ్మూర్తి,షాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ యాలం వెంకటలక్ష్మి దేవేందర్,ఏటూరు నాగారం మండల మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదరి రామయ్య,మాజీ సర్పంచ్ లు బత్తుల వెంకట నరసయ్య,ఎల్ల బోయిన సమ్మయ్య,యాలం పాపారావు, మాజీ ఉపసర్పంచ్ మాదరి చిరంజీవి,మాదరి రాజు,సి పి ఎంఎల్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు గాడిచర్ల సాంబయ్య,సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి కుట్ల ముత్తయ్య,

సిపిఎం ఎంఎల్ మండల పార్టీ అధ్యక్షులు సల్ల రాజిరెడ్డి,

మండల కార్యదర్శి మల్లేష్, చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ ఎస్కె నూర్జహాన్ లతోపాటు సుమారు 600 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనంతరం వారు మాట్లా డుతూ.అన్ని వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని,ప్రతి ఒక్క కార్యకర్త కు టిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్ష అని అన్నారు.శ్రమించి పని చేసే ప్రతి కార్యకర్త కి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం,ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులుపెడుతున్నారని అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమం కోసం,

సీఎం కేసీఆర్ అహ ర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నేతలు,టిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి కెసిఆర్ పాలనలో,

గ్రామాలన్నీ అభివృద్ధి చెందు తున్న అన్నారు.ప్రజల ఆకాంక్ష మేరకు తము పాలన సాగి స్తున్నామని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,సకల సౌకర్యాలు కల్పిస్తున్నామ న్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రాజకీ యాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ధి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సంబడ వర్గాలు సుఖ సంతోషాలతో జీవిస్తు న్నారని వారు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వారు అన్నారు.

రాష్ట్ర సర్వ ముఖ అభివృద్ధి భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు రూపొందించిఅమలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

పార్టీ కార్యకర్తలు ప్రమాదవ శాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందు

కు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా సదుపాయంకల్పించామన్నారు

ఆసరా పింఛన్,రైతుల కోసం రైతు బందు,రైతు బీమా,24 గంటల ఉచిత కరెంట్ పేదల కోసం కళ్యాణ లక్ష్మి,షాదీము బారక్,వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,జడ్పి కోఆప్షన్ సభ్యులు వలియాబీ సలీం,

రైతు బంధు సమన్వయ సమితి ములుగు,భూపాలపల్లి జిల్లాల అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య,

ములుగు నియోజకవర్గ సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్,తుమ్మ మల్లారెడ్డి,సప్పిడి రామ నరసయ్య,ఎంపీటీసీ కుమ్మరి స్వప్న చంద్రబాబు,ఏటూరు నాగారం మండల సోషల్ మీడియా ఇంచార్జ్ జాడి బొజా రావు,మాజీ ఎంపీపీ తూరం పద్మ లక్ష్మీనారాయణ,ఏటూరు నాగారం టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షు రాలు ఈసం స్వరూప,మహిళా నాయకురాలు బండి లక్ష్మి, మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య,కావేరి చిన్ని కృష్ణ, దుర్గం నారాయణ,ఆలం రాంబాబు,రాజుయాదవ్,చిట్టి మల్ల సమ్మయ్య,గుడివాడ శ్రీహరి,పోడెం శోభన్ మహా బూబి,టిఆర్ఎస్ నాయకులు కాళ్ల రామకృష్ణ,కొండాయి చిన్ని, ధనపు నేని కిరణ్ కుమార్,కందకట్ల శ్రీనివాస్,

నాలుగు మండలాల సర్పంచ్లు వార్డు మెంబర్లు,ఏటూరు నాగారం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయ 

కులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: