CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి.ఇంటింటా నల్ల జెండాలుకట్టి నిరసన తెలియజేసి ప్రదర్శన కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు సూ దన్ గారు.

Share it:




ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మే డేపల్లి గ్రామం లో టిఆర్ఎస్ రాష్ట్ర పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం చేపట్టిన నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తాత మధుసూదన్ గారు పాల్గొన్నారు స్వయంగా నల్ల జెండాలను ఇంటింటికి కట్టి నిరసన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకుఈ సందర్భంగా ఆయన నిప్పు పెట్టి దగ్ధం చేశారు కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి అని తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని కార్యకర్తలు గ్రామ రైతులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు రైతులు నల్లజెండాలు చేబూని కేంద్రం దిష్టిబొమ్మతో పాడి కట్టి వినూత్న రీతిలో గ్రామంలో డప్పు చప్పుళ్ళతో ప్రదర్శన నిర్వహించారు గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తాత మధుసూదన్ గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన అన్నారు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని భారీగా సమీకరించి పంజాబ్ తరహా ఉద్యమానికైనా వెనుకాడేది లేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూరి తంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు పంజాబ్ కి ఒక రీతి మిగతా రాష్ట్రాలకు ఇంకొకరీతి అన్నట్లుగా వ్యవహ ఇస్తుందని ఆయన ఘాటు విమర్శలు చేశారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానల్లజెండాలతో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం తో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని ప్రభుత్వం తక్షణమే దిగి రావాలని ఆయన డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ గారు మేడేపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు శ్రీ సామినేని వెంకటేశ్వరావు గారు పార్టీ మండల అధ్యక్షులు శ్రీ వాచే పల్లి లక్ష్మారెడ్డి పార్టీ మాజీ మండల అధ్యక్షులు శ్రీ మీగడ శ్రీనివాసరావు గారు గ్రామ సర్పంచ్ శ్రీ సామినేని రమేష్ గారు గారు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ బంక మల్లయ్య గారు నాయకులు పసుపులేటి వెంకట గారు మందరపు ఎర్ర వెంకన్న గారు బీసీ ఎస్సీ సెల్ లమండల అధ్యక్షులు శ్రీ తోట ధర్మా గారు శ్రీ చెరుకుపల్లి బిక్షం గారు వెంకటాపురం సర్పంచ్ శ్రీ కోటి అనంత రాములు గారు పోటు ప్రసాద్ గారు నాయకులు నాగార్జున్ పాషా వీరనారాయణ మల్లేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

*ఘన స్వాగతం*

పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తాత మధుసూదన్ రావు గారు తొలుత మేడిపల్లి గ్రామం లో అడుగు పెట్టిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ మరియు పిఎసిఎస్ చైర్మన్ శ్రీ సామినేని వెంకటేశ్వరావు గారు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ సామినేని హరి ప్రసాద్ గారు సర్పంచ్ శ్రీ రమేష్ గారు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం కట్టంగూర్ టు సీతారాంపురం వెళ్ళు రోడ్డు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు ముదిగొండ నుండి సువర్ణపురం వెళ్ళు బైపాస్ రోడ్డు మార్గాన్ని అం డరు పాస్ ఇవ్వాలని పార్టీ నాయకులు తోట ధర్మ ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత కాంట్రాక్ట్ తో మాట్లాడారు అనంతరం ఉపాధి కూలీ మహిళలతో ఆయన మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చేసిన పనికి సక్రమంగా వేతనాలు పడటం లేదని ఎమ్మెల్సీ దృష్టికి కూలీలు తీసుకెళ్లారు సంబంధిత పిడి తో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు గ్రామంలో ప్రదర్శన ఇంటింటికి నల్లజెండాలు కట్టినిరసన తెలియజేశారు

Share it:

TS

Post A Comment: