CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఓటరు జాబితా ముసాయిదా విడుదల....

Share it:

  


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: వివిధ పంచాయతీలలో ఖాళీ ఏర్పడ్డ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేసినట్లు ఎంపీడీవో అన్నపూర్ణ తెలిపారు. శుక్రవారం దామరచర్ల పంచాయతీలోని 3వ వార్డు, చండ్రుగొండ లోని 12వ వార్డు, రేపల్లెవాడ లోని 8వ వార్డు లకు ఎన్నికల ఓటరు జాబితా ముసాయిదా ఆయా పంచాయతీ కార్యాలయల్లో అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: