CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రసాభాసగా సర్వసభ్య సమావేశం.

Share it:

 


మన్యం మనుగడ / వాజేడు: 

కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరించకపోవడం పై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ శ్యామల శారద, జడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎంపీడీవో వి. విజయ మిషన్ భగీరథ అధికారి డిఈ,తో మాట్లాడుతూ..మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా రాక పోవడంతో పాటు పైపులైన్లు కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వ్యాసాయ బెడద తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా వెంటనే పరిష్కరించాలని అధికారికి సూచించారు. ప్రజలకు మంచినీటి సమస్యలను పట్టించుకోకపోతే సీరియస్ గా ఉంటుందని మిషన్ భగీరథ అధికారులను హెచ్చరించారు. మిషన్ భగీరథ అధికారులు ఏమాత్రం పనిచేయడం లేదని, భగీరథ పైపులు పగిలి పోయి అక్కడ అక్కడ నీరు వృధాగా పోతున్న పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. మిషన్ భగీరథ సమస్యలలో ప్రజలకు అందుబాటులో ఉండక పోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులకు హెచ్చరించారు.


ప్రజా ప్రతినిధులతోను, అధికారాలతో సర్పంచ్... ఫైర్


సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రోటోకాల్ పాటించడం లేదని సర్పంచ్ తల్లడి ఆదినారాయణ సమావేశం మధ్యలో మండిపడ్డారు. సర్వసభ్య సమావేశానికి, పోరం లేదంటూ సమావేశం వాయిదా వేయాలని కోరడం జరిగింది. వివిధ శాఖలు కనిపించడం లేదని అలాంటప్పుడు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు అని ప్రజాప్రతినిధులను, అధికారులను, ప్రశ్నించారు.సర్వసభ్య సమావేశం మధ్యలోనే సర్పంచ్ ఆదినారాయణ,నేను ఉండను అంటూ సభ నుండి వెళ్లి పోయారు, అనంతరం సర్వ సభ సమావేశం సజావుగా కొనసాగించారు.ఫారెస్ట్, రెవిన్యూ అధికారులు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. గొల్లగూడెం సర్పంచ్ జజ్జరి మేనక మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ వారు మా గ్రామం లో ఒక వీధిలో కరెంట్ లైన్ లేదని ఆ వీధిలో మూడు పోల్స్ వేసి వారి విద్యుత్ కష్టాలు తీర్చలి అని కోరగా విద్యుత్, ఎ ఈ, మా పండ్ లేదని మీ పంచాయతీ నుండి డబ్బులు చెల్లిస్తే లైన్ వేస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ రామచంద్ర వర్మ, ఎఫ్ ఆర్ వో చంద్ర మొగిలి, ఎంపీడీవో విజయ, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: