CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం.

Share it:

 


  • ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ.మాహాత్మ జ్యోతిరావు పూలే అణచి వేత కు గురైన బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు. ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని అన్నారు. పూలే విద్య వివక్ష,పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలిం చడానికి ఎంతో కృషి చేశారు. కుల,మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు.సమాజం విద్యా పరం గా ఆర్థికంగా ఎదిగిన ప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశిం చారు.సమాజంలోని,అన్నివర్గాల అభివృద్ధి కోసం పూలే పని చేశారని,జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో పూణే జిల్లాలోని ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు.పూలే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చా రని,పూలే 1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించారు.

ఈ కేంద్రం ద్వారా వితంతువు లైన గర్భిణీ స్త్రీలకు ఆయన అండగా నిలిచారని,పూలేశూద్ర వర్ణాల్లో వివక్షకు గురవుతున్న కులాల గురించి పోరాడటంతో పాటు అగ్ర వర్ణ వితంతువుల పునర్వివాహం కోసం కృషి చేశారని,సేద్యగాని చర్మకోల', గులాం గిరి 'అనే గ్రంథాలను పూలే రచించారని అన్నారు.

శూద్రులకు చదువు చెప్పించా ల్సిన అవసరం ఉందని నివేది కలిచ్చి బ్రిటిష్ వారితో పాఠశా లలను ఏర్పాటు చేయించారని, 1872 లో ఒక బ్రాహ్మణ యువ తికి పుట్టిన బిడ్డనే ఫూలే దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించారని,బాలునికి యశ్వంత్ అని పేరు పెట్టారని

పూలే స్థాపించిన సత్యశోధక సమాజం,భగవంతుడికి భక్తు డికి మధ్య దళారీలుగా పురో హితులు ఉండవద్దని పిలుపు నిచ్చిందని,ఆ కాలంలోనే ముని సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజా ప్రతినిధిగా కూడా సేవలందిం చారని,దీనబంధు అనే పత్రిక ద్వారా బీదల,కార్మికుల సమ స్యలు సమాజానికి తెలిసేలా చేశారని,భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్‌ అంబేద్కర్‌ జ్యోతిబా పూలే తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం సులభంగా అర్థమ వుతుందని అన్నారు.ఈరోజు ఆమహనీయుని 195 జయంతి సందర్భంగా వారి సేవలు గుర్తు చేసుకొని ఆయనకు ఘనంగా నివాళుల ర్పించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్శవడ్ల వెంకన్న,

పిఎసిఎస్ మాజీ ఛైర్మన్ దేవులపల్లి విజయకుమార్,

జిల్లా నాయ కులు ఎండి ఖలీల్ ఖాన్,మాజీ మండల అధ్యక్షు లు,మాజీ ఎంపిటిసి వావిలాల నరసింహారావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,

మండల యూత్ అద్యక్షుడు వసంత శ్రీనివాస్,కట్కురి రాధిక,ఈసం జనార్ధన్,సనప కిరణ్,సోదరి రామయ్య,

తూరుపటి కుమార స్వామి,

టౌన్ కార్య నిర్వాహక ఇంచార్జి సరికొప్పుల శ్రీనివాస్,టౌన్ అధ్యక్షులు బండారి లక్కీ,

ముస్తఫా,రాజు తదితరలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: