ఖమ్మం : నగరంలో మంగళవారం అఖిల భారతీయ వాల్మీకి మహాసభ ఖమ్మం శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సంగెల ప్రకాశ్ కుమార్ అధ్యక్షతన డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . అనంతరం వారి చిత్ర పటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు . ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని , ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు . బాబు జగ్జీవన్ రాం దేశానికి , బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో వైస్ ప్రసిడెంట్ హఠవల్ జయప్రకాశ్ , జిల్లా వైస్ ప్రసిడెంట్ లోహెర్ హిఠాలాల్ , దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుక్కల రాములు , జిల్లా వడ్డెర సంఘం కార్యదర్శి తమ్మిశెట్టి రాము , దళిత నాయకులు పొలమారు శ్రీరాములు , జగజీవన్ రావ్ యువజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కుక్కల రామక్రిష్ణ , టి. ఆర్. యస్ నాయకులు అయినాల రాజు తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: