CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్సీ , తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన - మేడా.

Share it:

 నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ఎమ్మెల్సీపల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో వారి నివాసంలో తెరాస ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు , నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మేడా విజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు . గతంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ లో బలంగా పని చేసామని , కేసీఆర్ గారు ఆదేశాల మేరకు అనేక పోరాటాలు కూడా చేయడం జరిగిందని , నామినేటెడ్ పదవులలో గానీ , ఎస్టీ ట్రైకార్ లో గాని సముచిత స్థానం కల్పించాలని కోరారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనుల పక్షపాతి అని , తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు . ఎరుకల కులానికి చెందిన తమకు రాష్ట్ర రాజకీయాల్లో కూడా స్థానం కల్పించాలని , అందుకు మీ వంతుగా కృషి చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మేడా కోరారు . అందుకు ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్రరైతు సంఘం అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు స్పందిస్తూ నా వంతుగా కచ్చితంగా న్యాయం చేస్తానని మేడా కి హామీ ఇచ్చారన్నారు . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో దగ్గరగా ఉన్న పార్టీ పెద్దలతో తనకు ఉన్న పరిచయలు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు .

Share it:

TS

Post A Comment: