CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అమలుకై చలో కలకత్తా జయప్రదం చేయండి..

Share it:

 



  • సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు ఏరియా అధ్యక్షుడు మంగీలాల్ కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపు


మన్యం మనుగడ, మణుగూరు:



 సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, క్యాటగిరి వన్ అమలుచేయాలని కోరుతూ చలో కలకత్తా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు ఏరియా అధ్యక్షులు మంగీలాల్ కోరారు పై కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం ఓసి కాంట్రాక్ట్ కార్మికుల తో కలిసి ఆయన మాట్లాడారు ఈ నెల 22వ తేదీ కలకత్తా లోని కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం లో జరుగు బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం చర్చల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఫస్ట్ కేటగిరి బేసిక్ , సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లింపు, ప్రమాద ఎక్స్ గ్రేషియా, అనారోగ్యం లేదా కారణాలతో కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు కానీ ప్రైవేటు వాహనాల డ్రైవర్లు కానీ చనిపోతే వారి కుటుంబాలకు "కాంట్రాక్ట్ కార్మిక బాసట స్కీం" అమలు చేయాలని తదితర దీర్ఘకాలిక డిమాండ్లపై చర్చించాలని సింగరేణి యాజమాన్యం కూడా పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని వీటికై ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ కోల్ కత్తా కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులను కోరారు, అలాగే ఈనెల 20వ తేదీ సాయంత్రం మూడు గంటలకు స్థానిక జిఎం కార్యాలయం వద్ద జరుగు కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా లో కూడా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్ ల వద్ద కరపత్రాలు గ్రూప్ మీటింగ్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని బ్రాంచ్ కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో కార్మికులు ఆనంద్, సామ్యూల్, సైదులు, ముత్తయ్య, శంకర్, ప్రసాద్, ఖాదర్ బాబు, కృష్ణ, చారి, రాజు, కొప్పుల సీత, కళావతి, నాగలక్ష్మి ,వెంకట్ లక్ష్మి ,రమణ, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: