CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా వరాల జల్లు.ఆదివాసి మారుమూల గ్రామంలో విస్తృత పర్యటన.ప్రజా సంక్షేమమే ధ్యేయం: రేగా.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ,ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ రోజు మనుబోతుల పాడు గ్రామపంచాయతీ లో పర్యటించడం జరిగింది. అశ్వాపురం మండలం లోని మను బోతులగూడెం, వేములూరు గ్రామాల్లో శనివారం నాడు గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడుతూ మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నీటి, రోడ్ల సమస్య లు, ఉన్నాయని త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా మనుబోతుల పాడు గ్రామపంచాయతీ ప్రజలకు వరాల జల్లు కురిపించడం జరిగింది. కోటి రూపాయల నిధులు మంజూరు చేసి మనుబోతుల పాడు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలియజేశారు.పట్టా కలిగిన ప్రతి రైతుకు లక్ష రూపాయల చొప్పున 60 మంది రైతులకు 60 లక్షలు మరియు త్రీఫేస్ కరెంటు , సీసీ రోడ్లు ,వాగులపై కల్వర్టులు , డబుల్ బెడ్రూమ్ ఇళ్లు , వలస వచ్చిన కొత్తికోయలకు కూడా నీటి వసతి ,కరెంటు సదుపాయం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.అలాగే మహిళా దినోత్సవ నాడు మణుగూరులో జరిగిన ప్రమాద బాధితులకు 28 మంది బాధితులకు ఒక్కొక్కరికి అయిదువేలు చొప్పున లక్షా నలభై వేల రూపాయలు,ఇరవై ఎనిమిది బాధితులకు ఒక్కొక్కరికి క్వింటా బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కోరం రామారావు,ఎంపీటీసీ లు తాటి పూజిత, కొమరం చిట్టెమ్మ, మాజీ ఎంపీటీసీ గొంది గోపాలరావు, స్థానిక సర్పంచు ఏనిక స్వరూప, ఉప సర్పంచ్ కొమరం రాంప్రసాద్, సర్పంచులు మడకం సాదు, కాక అశోక్, బండ్ల సంధ్యారాణి, పారసీక సూరిబాబు, కాలేటి నరసింహారావు, పాయం భద్రయ్య, కల్లూరు లక్ష్మీ నారాయణ, కుంజా రామారావు, మన బోతుల పాడు గ్రామ శాఖ అధ్యక్షులు ఏనీక శివాజీ, గొంది గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బండ్ల బాబురావు,తెరాస పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు, జాలే రామకృష్ణారెడ్డి, చిలక వెంకట్రామయ్య, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గొర్రెముచు వెంకటరమణ, ఎస్ టి సెల్ అధ్యక్షులు కొరస దుర్గారావు, బీసీ సెల్ అధ్యక్షులు మామిళ్ల కనిష్, యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకల రమేష్, మండల నాయకులు మొగిళ్ళ వీరారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, సోయం శ్రీను,మేడవరపు సుధీర్, వెంకటాచారి, సురేందర్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు మల్ల బోయిన ప్రశాంత్, గజ్జి లోహిత్, మహేష్,మండల యువజన నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: