CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో ఎంఓయూ.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో యారో వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ( ఎంఓయూ) శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేసుకోవటం జరిగింది.కాకతీయ పేపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆధరైజ్డ్ ఏజెన్సీ గా ఉన్న యారో వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ మణుగూరు మున్సిపాలిటీ లోని తడి చెత్త,పొడి చెత్త ను సేకరించి రెండిటినీ వేరు చేసి తిరిగి ఉపయోగించుకునే విధంగా తయారు చేస్తూ, మున్సిపాలిటీకి అత్యంత భారంగా మారిన చెత్త సేకరణ సరళీకృతం చేస్తూ,అందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు విద్యార్థులను జాతీయ సేవా పథకం ఎన్ ఎస్ ఎస్ ద్వారా భాగస్వామ్యం చేస్తూ,స్వచ్ఛ మణుగూరు లక్ష్యంగా పని చేయాలని తీర్మానించారు.‌ఈ ఎం ఓ యూ మూడు సంవత్సరాలకు చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్, మాట్లాడుతూ,విద్యార్థులు భవిష్యత్తులో పేరుకు పోయే చెత్తను తిరిగి ఉపయోగించుకునే విధంగా ఎలా రూపొందించుకోవాలి అని అవగాహన కలిగి ఉండడం ప్రస్తుత సమాజానికి ఎంతైనా అవసరమని,కావున విద్యార్థులు అందరూ భాగస్వాములు కావాలని వారు కోరారు.మణుగూరు మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ మాధవి మాట్లాడుతూ,చెత్త నిర్వహణలో ప్రజలు అందరూ భాగస్వాములు అయితేనే, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించగలరని అన్నారు.ఈ ఎంఓయూలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్, యారో వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ తరఫున ప్రోగ్రాం మేనేజర్ జి రాము సంతకాలు చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ జూపూడి అనిల్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ అనురాధ, డాక్టర్ రమేష్ బాబు,జి రామ్ తిరుపతి,పి.భాస్కర్ రావు, సాంబమూర్తి,ఇ అశోక్ శివ కుమార్,నాగిరెడ్డి,సతీష్,రవి,శరణ్య,సుజాత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: