CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కెసీఎస్పీ బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కీల్డ్ వర్కర్లుగా గుర్తించాలి.

Share it:


  • ఐఎఫ్ టియు ఆధ్వర్యంలో సీఎస్పీ డిజిఎం సురేష్ కు వినతి పత్రం అందజేసిన బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు          

మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులోని సింగరేణి

కెసిఎస్పి క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని కోరుతూ,ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఉదయం సీఎస్పీ డిజిఎం సురేష్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు నాయకులు మంగీలాల్ మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా కొండాపురం సి ఎస్ పి లో గత 20 సంవత్సరాలుగా బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు గా అనేక మంది పనిచేస్తున్నారని ఏనాటికైనా తమకు హై పవర్ కమిటీ వేతనాలు అందక పోతాయా లేదా యావత్ సింగరేణి లోనే బొగ్గు రవాణా లో (డిస్పాచ్) కొండాపురం సి ఎస్ పి ప్రథమ స్థానంలో నిలబడుతోందని పర్మినెంట్ కార్మికులతో పాటు తమ శ్రమను కూడా గుర్తించి సింగరేణి యాజమాన్యం ఏనాటికైనా కనీసం తను సెమి స్కిల్డ్ వర్కర్లుగా ప్రమోట్ చేసి ఎంతో కొంత ఆర్థిక లాభం చేకూరుస్తుందని కార్మికులు ఎదురుచూస్తున్నారని అన్నారు.ఈ ఏడాది కూడా సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేసి మరో మైలురాయిని అధిగమించిన సందర్భంగానైనా కొండాపురం సి ఎస్ పి బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కీల్డ్ వర్కర్స్ గా గుర్తించే విధంగా కార్పొరేట్, యాజమాన్యానికి స్థానిక యాజమాన్యం కూడా తగు సిఫారసు చేయాలని కోరుతున్నామన్నారు.కొండాపురం సి ఎస్ పీ బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కీల్డ్ వర్కర్లుగా గుర్తించాలి. 2021-22 వార్షిక బొగ్గు రవాణా లో ప్రథమంగా నిలిచి ప్రశంసలు అందుకున్న సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ బహుమతులు అందజేయాలి అని,కాంట్రాక్ట్ కార్మికులకు కూడా స్వీట్లు పంచాలి అని, దుమ్ము ధూళి నివారణ కు సత్వర చర్యలు చేపట్టాలి అని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఎస్పీ బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు సంజీవ్ రావు,టి.భద్రం, లక్ష్మీనారాయణ,బి.లింగయ్య,డి.సాంబయ్య,జై కృష్ణ,ఎం. నాగరాజు,ఎస్.వెంకటేశ్వర్లు,కే రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: