మన్యం మనుగడ ములుగు
పెండింగ్ ఇసుక దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని భూగర్భ వనరుల శాఖ అధికా రులను జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావే శానికి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య హాజరై మాట్లాడాతూ.
తాడ్వాయి మండలం,కన్నెపల్లి జంపన్న వాగు వద్ద ఇసుక దిబ్బలు వాటి ద్వారా పంట భూములు దెబ్బతింటు న్నాయని,రైతుల నుండి చాలా దరఖాస్తులు వచ్చాయని ఇసుక క్వాలిటీ ఉందా లేదా ఇంటి నిర్మాణపు కట్టడికి పనికి వస్తుందా లేదా అని మైనింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.తుమ్మల వాగు ఇసుక రీచ్ ప్రపోజల్ చేశామని రెండు సంవత్స రాలలో ఆయా గ్రామాలు పంటలు చాలా దెబ్బతి న్నాయని అందుకు సర్వేర్ సంబంధిత ఇంజనీర్లతో పంట భూములకు నష్టం జరగకుండా పరిష్కారం చేయాలని ఆదేశించారు.పెండింగ్ ఇసుక రీచ్ అగ్రికల్చర్ ఆఫీసర్ తో ఏడి మైనింగ్ శాఖ సర్వే చేయాలని పట్టాదారుని భూము లలో సొసైటీ వాళ్ళు చుట్టు హద్దులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తే బాధ్యత సొసైటీ వారి దేనని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పెండింగ్ దరఖాస్తులు చాలా ఉన్నాయని పట్టా భూముల ను,సొసైటీ భూములను గుర్తించుట లో ధరణి పోర్టల్ రికార్డ్స్ పరిశీలించి జాగ్రత్తగా ఈ ఫైలింగ్ చేయాలని సంబంధితశాఖ అధికారులకు ఆదేశించారు.వర్షాకాలం సీజన్ తర్వాత ఇసుక రీచ్ ను ప్రపోజల్ చేయాలని,అట్టి నివేదికలు పూర్తి వివరాలతో ధరణి రికార్డ్స్ ఆధారంగా పంపించాలని అధికారులను ఆదేశించారు.ఇసుక లారీల లోడింగ్ సాయంత్రం 5:30 వరకు పూర్తిచేసుకుని రాత్రి 8 గంటల లోపు జిల్లా సరి హద్దులు దాటాలని అట్టి విషయం రిచ్ ఓనర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు.ఇప్పటికీ ఇసుక లారీల వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ప్రాణనష్టం జరుగుతుందని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వాటి వద్ద పెయింటింగ్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జానంపేట లారీలు ఖమ్మం సూర్యాపేట మీదుగా వెళ్లేలా చూడాలని,బ్రాహ్మణపల్లి దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లారీలను నియంత్రించాలని ఆదేశించారు.ప్రతి మండలంలో ప్రతిరోజు ఎన్ని వెహికల్ వెళ్తున్నాయో ఒక్క నివేదిక ఉండాలని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్,డిఎఫ్ ఓ ప్రదీప్ కుమార్ శెట్టి,డిఆర్ఓ కే రమాదేవి మైనింగ్ ఏడి రఘుబాబు,తాసిల్దార్లు,ఎంపీడీవోలు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: