CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు .

Share it:

   •  జిల్లా కేంద్రం లోని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు...

మన్యం మనుగడ, భద్రాద్రి జిల్లా ప్రతినిధి:

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ , టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ &మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తెలంగాణలో రైతాంగం పండించిన వేసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి జిల్లా కేంద్రంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది.

 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ...

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని వేళలా అండగా ఉంటుందని, రైతు అనుకూల ప్రభుత్వమని , భూమికి బరువు అయ్యేంతగా రైతులు పంటలు పండిస్తున్నారు.

అని ధాన్యం సేకరణ లో కేంద్రం నిర్లక్ష్యం వెంటనే నేటి ఈ పరిస్థితికి కారణమన్నారు, కేంద్ర వైఖరిని పట్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపాలిటీలలో పల్లెల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమ అని పేర్కొన్నారు.

24 గంటల కరెంటు తో రైతులు సుఖంగా ఇంటి దగ్గర వారి కుటుంబ సభ్యులతో నిద్రపోతు న్నారని, గతంలో ఈ పరిస్థితి ఉండేదా అని రైతులను ఉద్దేశించి గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ,గ్యాస్, ధరలను పెంచి విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడతామని భయపెడుతూ, పన్నులు వసూలు చేస్తామని అంటున్నారని, సామాన్య మధ్య తరగతి మరియు రైతులు నడ్డి విరుస్తున్నారని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని, రైతు చట్టాల పై ఉద్యమం వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని, మళ్ళీ ఉద్యమం చేసే పరిస్థితి వచ్చిందని రైతులు ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉండాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వైఖరి పట్ల ముందుగానే రైతులను హెచ్చరించి వరి పంట వేయొద్దని తెలియజేశారని కానీ బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్రం కొనుగోలు చేస్తది అని రైతులను వరి వేసుకోవచ్చని బిరాలు పలికారని నేడు రాష్ట్రమే కొనాలని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

 బిజెపి నాయకులకు అబద్ధాలు కొత్తది కాదని గతంలో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను ,ప్రజలను, మోసం చేశారని గమనించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 అభివృద్ధికి విషయం మాత్రం బిజెపి నాయకులు మర్చిపోయారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

ఒకే నేషన్ నినాదం అంటూ కేంద్ర ప్రభుత్వం జిఎస్ టి విధానాన్ని తీసుకు కోచ్చిందని, ఒకే దేశంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.వచ్చే రోజుల్లో రైతు ఉద్యమం చేసే ఆవశ్యకత ఉందని, రైతుల సిద్ధంగా ఉండాలని కార్యచరణ తెలియజేస్తామని అన్నారు...

 అనంతరం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బృందం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్లు , ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ , అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు , భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు , జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య, వైస్ చైర్ పర్సన్ కంచర్ల చంద్రశేఖర రావు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ , కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతా మహాలక్ష్మి , ఇల్లందు మునిసిపల్ చైర్ పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు,అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, డిసిసిబి డైరెక్టర్ లు, డీసీఎంఎస్ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్ లు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, కౌన్సిలర్ లు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్ లు, వైస్ ఎంపీపీ లు, సొసైటీ వైస్ చైర్మన్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, మండల కో ఆప్షన్ సభ్యులు, సొసైటీ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, వార్డ్ నెంబర్ లు, అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ శాఖ అధ్యక్షు, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: