CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజల ఇష్టం మేరకే రేగా నగర్ ఏర్పాటు చేశాం :- టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కబ్జా చేశారు మీరు చూపిస్తారా.

Share it:

 


  • :- కొన్ని దుష్ట శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
  • :- తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు

గుండాల/ఆళ్ల పల్లి ఏప్రిల్ 20(మన్యం మనుగడ) ప్రజల ఇష్టం మేరకే రేగా నగర్ను ఏర్పాటు చేశామని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. రేగా నగర్ పేరుతో భూకబ్జాలు చేస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇక్కడే ఉన్నందున గుట్ట బోడు అంటే బాగా లేదన్న ఉద్దేశంతోనే దాని పేరును రేగా నగర్ గా మార్చబడినది అన్నారు. కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కబ్జా చేశారు నిరూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, కోపరేటివ్ చైర్మన్ రామయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , మైనార్టీజిల్లా నాయకులు ఆదాం, ఖయ్యుం, హతహర్, నరెడ్ల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: