CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఖండిస్తూ నిరసన దీక్ష.

Share it:

 


  • పంజాబ్,హర్యానా రాష్ట్రాలకు ఒక న్యాయం తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయం మా?
  • ఈనెల ఏడో తారీఖున ములుగు జిల్లా కేంద్రంలో మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
  • ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ జగదీష్.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు,తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్,టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఖాజా పాషా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్షా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ హాజరై మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి అనడం ఆయన విజ్ఞతకే..తెలంగాణ రైతులు పండించిన పంటను నూకల గా ఉంటాయని అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.పంజాబ్,హర్యానా రాష్ట్రాలకు ఒక న్యాయం మా తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయమా అని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో గా ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం బిజెపి కక్షసాధింపు విడనాడాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే వరకు ఉద్యమం ఆపేది లేదని అన్నారు.అలాగే ములుగు జిల్లా కేంద్రంలో ఈ నెల 7వ తారీఖున మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి రైతులు, తెరాస పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని,మన రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షతను గట్టిగా వినిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండి వలీ యాబీ సలీం,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,పి ఏ సి ఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్,ఏటూరు నాగారం వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సప్పిడి రామ నరసయ్య,ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి స్వప్న చంద్రబాబు,రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దనపు నేని కిరణ్ కుమార్,మండల సోషల్ మీడియా ఇంచార్జి బోజ రావు, టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కొండాయి చిన్ని, కందగట్ల శ్రీనివాస్,టిఆర్ఎస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు ఈసం స్వరూప, ప్రధాన కార్యదర్శి సయ్యద్ సఫియా,మాజీ ఎంపీపీ తూరం పద్మ,మాజీ మండల అధ్యక్షులు కునూరు మహేష్ గౌడ్,మహిళా నాయకురాలు బండి లక్ష్మి,వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్లు,వార్డు మెంబర్లు,రైతులు,టిఆర్ఎస్ పార్టీ యూత్,మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: