మన్యం టీవీ చర్ల:
చర్ల మండలానికి చెందిన టీఆర్ఎస్ వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన బుధవారం మధ్యాహ్నం చర్లలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్న టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పరుచూరి రవికుమార్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చర్ల వైద్యశాలకు తరలించి చికిత్స చేపిస్తున్నట్లు తెలిసింది. టిఆర్ఎస్ మండల కార్యదర్శి నాక్కబోయిన శ్రీనివాసరావు వర్గం పరుచూరి రవికుమార్ పై దాడిచేసి అతని కారు కూడా ధ్వంసం చేశారు.
Post A Comment: