CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సుందర్ థియేటర్లలో ఆడుతున్న సేవాదాస్ సినిమాను వీక్షించడానికి వచ్చిన చిత్ర యూనిట్..

Share it:

 



ఖమ్మం : నగరంలో ఆదివారం సుందర్ థియేటర్లలో ఆడుతున్న సేవాదాస్ సినిమాను వీక్షించడానికి వచ్చిన చిత్ర యూనిట్ సందడి చేశారు . వచ్చిన యూనిట్ సభ్యులకు ప్రేక్షకులు పూల వర్షంతో స్వాగతం పలికారు . ఈ సినిమా హీరో కథ స్క్రీన్ప్లే దర్శకత్వం బంజారా మెగాస్టార్ కేపియన్ చౌహాన్ మాట్లాడుతూ ఈ సినిమా హీరో మాట్లాడుతూ మేము ఎంతో కష్టపడి తీసిన సినిమాను నా బంజారా బిడ్డలు అందరూ కుటుంబ సభ్యులతో తప్పక చూసి మమ్ముల్ని ఆశీర్వదిస్తే మేము మరిన్ని మంచి సినిమాలు భవిష్యత్తులో తీస్తాము అని చెప్పారు . వీరితో పాటు ప్రొడ్యూసర్ వినోద్ రైనా ఇస్లావత్ , కో ప్రొడ్యూసర్ బాలు చౌహాన్ , కోడైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు . వచ్చిన సినిమా యూనిట్ కి పూల మాల వేసి శాలువతో ఘనంగా అభిమానులు సత్కరించారు . ఇలాంటి బంజారా సినిమాలను మరెన్నో తీయాలని ఉచితంగా సినిమాను బంజారా ప్రేక్షకులకు చూపించిన బానోతు కోటేశ్వరరావు , బానోతు శ్రీనివాస్ నాయక్ , రవి రాథోడ్ , ధరావత్ రామ్మూర్తి నాయక్ , మాలోతు దేవేందర్ కుమార్ , బానోతు గబ్బర్ సింగ్ , తదితరులు ఆకాంక్షించారు . బంజారా బిడ్డలు గౌరవ పడేలా సూపర్ డూపర్ హిట్స్ సినిమాలు తీసి అగ్ర స్థానంలో నిలవాలని కోరారు . ఈ సినిమాను బంజారా ప్రముఖులతో పాటు సుమారుగా 1000 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ అవకాశం ఇచ్చిన ధియేటర్ యాజమాన్యానికి , ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

Share it:

TS

Post A Comment: