CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జార్జిరెడ్డి పోరాట స్ఫూర్తితో ఆధిపత్య ధోరణితో వస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం.

Share it:

 



  • జార్జిరెడ్డి అమరత్వానికి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రపట లోగో ఆవిష్కరణ

మన్యం మనుగడ వెబ్ డెస్క్:

ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జిరెడ్డి సాగించిన విప్లవపోరాటం తెలుగు నేలపై కొత్త అధ్యాయాన్ని రచించిందని ఆధిపత్య వ్యవస్థలపై ఎదురునిలిచి పోరాడి ప్రాణాలు అర్పించిన జార్జిరెడ్డి స్ఫూర్తితో నేటి విద్యార్థి యువకులు ఉద్యమించాలని పి డి యస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాంపాటి పృధ్వీ, పివైయల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకుడోత్ అజయ్ అన్నారు. ఈరోజు పి డి యస్ యూ, పివైయల్ ఆధ్వర్యంలో జార్జిరెడ్డి అమరత్వానికి ఏప్రిల్ 14 తో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పి డి యస్ యూ, పివైయల్ రాష్ట్ర కమిటీ ల పిలుపులో భాగంగా ఏప్రిల్ 2 నుండి 15 వరకు జార్జి రెడ్డి వర్ధంతి సభలు విస్తృతంగా జరపాలని పిలుపునివ్వడం జరిగింది.అందులో భాగంగా ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జార్జి అమరత్వాన్ని 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జార్జి చిత్రపట లోగోను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్జి రెడ్డి జీవించిన పాతిక ఏళ్ళ కాలంలో విద్యార్థులు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల పై అడుగడుగున పోరాటం రూపొందిస్తూ అభివృద్ధి నిరోధక శక్తిలపై ఉద్యమించేందుకు బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాడని వారు అన్నారు.నేడు సమాజంపై మతోన్మాద రాజకీయాలు పట్టు బిగిస్తున్న సందర్భంలో భావప్రకటన స్వేచ్ఛ కోసం జార్జిరెడ్డి స్ఫూర్తితో ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.కళాశాల ప్రిన్సిపాల్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ జార్జిరెడ్డి ఉరకలెత్తే మేధస్సు కలిగిన అపర మేధావి అని జార్జిరెడ్డి అంటేనే జ్ఞాన సంపద అని విద్యార్థులు ఆయన స్ఫూర్తి క్రమశిక్షణ అలవర్చుకోవాలి అవసరం ఉందని వారు విద్యార్థులకు తెలియజేశారు.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో ఏప్రిల్ 13వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభను మరియు ఏప్రిల్ 14న ఉదయం 10గంటలకు జార్జి హత్య భావించబడిన సంఘటనా స్థలం నుండి రెడ్ షర్ట్స్ తో కవాత్ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాలలో విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘ నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పివైయల్ ఇల్లందు మండల అధ్యక్షులు ఇస్లావత్ కోటేష్ పి డి ఎస్ యు భద్రాద్రి కొత్త గూడం డివిజన్ కార్యదర్శి బానోతు నరేందర్ డివిజన్ కోశాధికారి జబ్బా సురేష్ పిడిఎస్యు ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి సాయి ఏ పార్థసారథి కోశాధికారి తరుణ్ శృతి నవ్యశ్రీ సాహితీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: