CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏటూర్ నాగారం బస్ డిపో సాధనకై ఉద్యమించాలి.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరునాగారం

బస్ డిపో సాధనకై ఐక్యంగా ఉద్యమించాలని భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ రూపొం దించడానికి బి ఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపాల శివ కుమార్ అధ్యక్షతన అన్ని కులసంఘాల నాయకులు సమావేశం జరిగింది.ఈ సమా వేశానికి ముఖ్య అతిథిగా మాజి ఎంపీపీ జాడి రామరాజు నేత మాట్లాడుతూ. ఏటూరు నాగారం బస్ డిపో సాధన కోసం ఏటూరునాగారం లో మండలం లోని రాజకీయాలకు అతీతంగా బస్ డిపో సాధనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏటూరునాగారం బస్ డిపో 1983 నుండి గత 39సంత్స రాల నుండి రాజకీయ నాయ కులు ఎన్నికలు వచ్చినపుడు మేము గెలిస్తే బస్ డిపో పూర్తి చేస్తాం అని చెపుతూ వెళుతు న్నారు. తప్ప గెలిచాక చేసే వారు లేరు అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ అయం లో బస్ డిపో కట్టినారు గానీ గత 25 సంత్సరాలనుండి పటించుకొనేవారే లేరు అని అన్నారు.బస్ డిపో ఎవరు పటించుకొనేవరు లేక డిపో శిథిల వ్యవస్థకు వచ్చిందిని 2017లో అప్పటి గిరిజన శాఖా మంత్రి అజ్మీరా చందూలాల్ కోటి రూపాయలు మంజూరు చేస్తే బస్ డిపో కి వినియోగించ కుండా ఆ నిధులను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు పటించుకొకపోవడం వలనే ఆ నిధులు బస్ డిపో కి వినియోగించ లేదు అని జాడి రామరాజు నేత అన్నారు. ఏటూరునాగారం బస్ డిపో అయితే మూడు రాష్ట్రాలకు కేంద్ర బిందువు అవుతుందని అన్నారు.ఆర్టీసీ అధికారులు పట్టించుకోని బస్ డిపో పునర్నిర్మాణం చేయాలని అన్నారు.ఇదే సమావేశంలో ఏటూరునాగారం లో రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ను కోరడం జరిగిందని అన్నారు.ఈ సమావేశంలో ఆర్టీసీ డిపో సాధన సమితి అడ్వక్ కమిటీ ఎన్నుకోవడం జరిగిందని,

కమిటీ కన్వీనర్ గా వావిలాల స్వామి ని ఎన్నుకోవడం జరిగింది.కమిటీ సభ్యులుగా పెండ్యాల ప్రభాకర్,పొడెం శోభన్,ఎండీ సులేమాన్,ఈసం యాదయ్య,శంకర్ ను ఎన్ను కోవడం జరిగిందని అన్నారు.

ఈ సమావేశం లో చిటమట రఘు,ఏ డి డి ఎస్ రాష్ట్ర నాయకుడు తిపనపల్లి సుదర్శన్,పరికి శ్రీనివాస్, వావిలాల సాంబశివరావు, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ పరీకి ప్రసాద్ చెన్న గణపతి వల్స తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: