CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

లిటిల్ ఇండియన్స్ హై స్కూల్ విద్యార్థులకు ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ , గోల్డ్ మెడల్స్ పంపిణీ.

Share it:


ఖమ్మం : నగరంలో ముస్తాఫానగర్ ప్రాంతంలో లిటిల్ ఇండియన్స్ హై స్కూల్ లో చదివే విద్యార్థులకు ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు గతంలో నిర్వహించిన స్టేట్ క్రియేటివ్ పెయింటింగ్ & సైన్స్ ఒలంపియాడ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ సర్టిఫికెట్స్ మరియు గోల్డ్ మెడల్స్ లను ముఖ్య అతిధులు చేతులమీదుగా అందజేశారు . ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ వ్యవస్థాపకులు అంతోటి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఈ విధంగానే పోటీపరీక్షల్లో పాల్గొంటూ తమ యొక్క ప్రతిభను చాటుకోవాలని కోరారు . ప్రత్యేకంగా ఈ యొక్క కాంపిటీటివ్ పరీక్షల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని , విద్యార్థులకు అభినందనలు తెలియపరిచారు . రాబోవు సంవత్సరం లో ఆన్లైన్ కంపెటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించబోతాం అని అన్నారు . ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో లిటిల్ ఇండియన్ స్కూల్ కరస్పాండెంట్ పసుపులేటి జోష్నా , శంకర్ , స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మరియు ట్రూ ఇంజనీర్స్ ఒలింపియాడ్ జిల్ల కోర్డినేటర్స్ చెన్నం రాజేశ్వరి , కుక్కల కావ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: