CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం కోర్టును సందర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు..

Share it:

 



  • నూతన కోర్టు భవన నిర్మాణానికి స్థలం మంజూరు, కోర్టు నిర్మాణం నిధుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
  • కొత్తగూడెం బార్ అసోసియేషన్ సమావేశంలో హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

కొత్తగూడెం (న్యాయ విభాగం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ స్థలం మంజూరు, దాని నిర్మాణ నిధులకు సంబంధించిన సమస్యలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకెళ్లి నూతన కోర్టు భవన నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని పినపాక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కొత్తగూడెం బార్ అసోసియేషన్ కు హామీ ఇచ్చారు. .గురువారం స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అను బ్రోలు రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి పై ముఖ్యమంత్రి దృష్టి ఉందని దానిలో భాగంగా జిల్లా కోర్టు భవన నిర్మాణానికి స్థలము, నిధులు ముఖ్యమంత్రి తప్పక మంజూరు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షులు ఆనుబ్రోలు రాంప్రసాద్ మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా కోర్టు నిర్మాణానికి కి ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు మంజూరు చేస్తే ముఖ్యమంత్రి పేరు, మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని, కోర్టు సమస్యలకి పరిష్కారం చూపించిన వారిగా మిగిలిపోతారని వివరించారు. అలాగే భద్రాచలం ఏజెన్సీ కోర్టు వారానికి రెండు రోజులు కొత్తగూడెం లో నడిచే విధంగా గా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కక్షిదారులకు, న్యాయవాదులకు సహకరించాలని రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లారు .దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మీరు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నానని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనుబ్రోలు రాంప్రసాద్, ఉపాధ్యక్షులు శరత్ షాహామీర్, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, సంయుక్త కార్యదర్శి మునిగడప వెంకటేశ్వర్లు, ట్రెజరర్ మహ్మద్ సాధిక్ పాషా, కల్చరల్ అండ్ గేమ్స్ సెక్రటరీ ,కర్నేకంటి శ్రీధర్, లైబ్రరీ సెక్రెటరీ ఆర్తి మక్కడ్, లేడీ రిప్రజెంటేటివ్ గాదె సునంద. మరియు సీనియర్ న్యాయవాదులు ఎం ఏ రజాక్ ,ఊటుకూరు పురుషోత్తం ,రమేష్ కుమార్ మక్కడ్ ,జలసూత్రం శివరాం ప్రసాద్, కటకం పుల్లయ్య, రావిరాల రామారావు, ఉప్పుశెట్టి సునీల్, అరకల రవి కుమార్ ,మహిళా న్యాయవాదులు సుంకర భానుప్రియ జీవీకే అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: