CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా మార్చుకున్న టిఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎం పార్టీలు.ఎండి యాకూబ్ పాషా, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు ఎం డి యాకుబ్ మైనారిటీ ప్రజలను ఉద్దేశించి, టిఆర్ఎస్,కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా మార్చుకొని గంపగుత్తగా ఓట్లు వేయించుకొని ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు.లక్షలాది మంది ముస్లింలకు కనీస సౌకర్యాలు ఉండదు.కూడు,గూడు,బట్టలు లేనివారు కూడా ఉన్నారు.మీకు కనిపించడం లేదా.?ఏనాడైనా వారి స్థితిని గురించి చట్టసభల్లో మాట్లాడిన వారు లేరు.దారిద్ర్యపు రేఖ దిగువన ఉన్నవారికి ఎలాంటి సహాయం అందిస్తున్నారని తెలియపరచాలి.ఎం ఐ ఎం పార్టీ స్థాపించి హిందూ,ముస్లింల మధ్య గొడవలు సృష్టించడం తప్ప మీరు ఎవరికీ న్యాయం చేసినారో తెలియజేయండి.కనీసం ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ అభివృద్ధికి మీరు ఎంత తోడు పడుతున్నారో ఈ దేశ ప్రజలందరూ వెయ్యి కళ్ళతో చూస్తున్నారు.

ఈ దేశంలో పుట్టిన వారందరూ భారతీయులం,అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు అందరికీ భారత రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించబడ్డాయి.అందరం ప్రాథమిక హక్కులను అధికారాలను అనుభవిస్తున్నాము. కులం పేరుతో,మతం పేరుతో ప్రజలను అవివేకులను చేస్తున్నారు.స్వతంత్రంగా ఆలోచించుకొని ఈ దేశ అభివృద్ధికి పాటుపడే వారికి ఓటు వేయాలనే ఆలోచన రానివ్వకుండా రాజకీయ నాయకుల స్వార్థం కోసం ప్రజలను ప్రభోవాలకు గురిచేస్తున్నారు.

ఈ దేశం నాకు ఏమీ ఇచ్చినది అని ఆలోచించకండి ప్రజలారా ఈ దేశం కోసం నేను ఏమి చేశాను,ఇంకా నాదేశం కోసం నేను ఏమి చెయ్యాలి అని ఆలోచించండి. ఇస్లాం ధర్మం అంటే ఎదుటివారిని భయబ్రాంతులకు గురి చేయడం,మాతృభూమికి అన్యాయం చేయడం కాదు.అది తప్పు అన్న వారిని భూమ్మీద లేకుండా చేయడమా.?ధనం కోసం,పదవి కోసం,ధర్మాన్ని వాడుకోవద్దు.హిందూ ముస్లింల మధ్య ఎలాంటి భేద భావములు,కొట్లాటలు లేవు,ఎంఐఎం పార్టీ అవలంబిస్తున్న పద్ధతులు వల్లనే ముస్లింలకు చెడ్డ పేరు వస్తుంది.ఎంఐఎం పార్టీ నాయకులు దేశమంతా తిరుగుతూ ఎలక్షన్ లో ప్రచారం చేస్తున్నారు.ఏ రాష్ట్రంలో నైనా ఎంఐఎం పార్టీ ద్వారా ముస్లింలకు గొప్ప ప్రయోజనాలు,ఉద్యోగాలు గాని చేకూరినట్లు అయితే ముస్లిం సోదరులకు తెలియపరచాలి.కొన్ని రాజకీయ పార్టీలు కుహనా లౌకిక వాదంతో కాంగ్రెస్,టిఆర్ఎస్ లు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.దేశాన్ని పాలించే నాయకుల మీద ప్రేమ లేని పార్టీలు కొన్ని అయితే,దేశం మీద ప్రేమ లేని పార్టీలు చాలా ఉన్నాయి. ఇలానే కొనసాగితే రాబోయే తరాలకు ఈ దేశ సంస్కృతి,సాంప్రదాయాల గురించి ఏమి చెబుతారు.అందరూ ఆలోచించాలి.కుటుంబాన్ని విడిచి దేశం కోసం పనిచేసేవారిని ప్రజలు నాయకునిగా ఎన్నుకున్నప్పుడే ఈ దేశ ఆర్థిక పరిస్థితి,ప్రజల జీవన విధానం మారుతుంది.అందరికీ ఆర్థిక ఫలాలు అందుతాయి.కులం, మతం అనే వాటికి దూరంగా ఉంచి అందరం కలిసి ఉన్నప్పుడే ఈ దేశం ప్రపంచంలోనే ఒకటోవ స్థానంలో నిలబడుతుంది అని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: