CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫారెస్ట్ ప్లాంటేషన్ పనులను అడ్డుకున్న పోడు సాగుదారులు.. - ఫారెస్ట్ అధికారులు పోడుసాగు దారుల మధ్య వాగ్వాదం..

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :


ఫారెస్ట్ అధికారులు నిర్వహిస్తున్న ప్లాంటేషన్ పనులను పోడు సాగుదారులు అడ్డుకోవడం ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రేంజ్ పరిధిలోని మద్దుకూరు బీట్ (సెక్షన్) పరిధిలో సుమారు 500 వందల ఎకరాల్లో సోమవారం ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జెసిబి తో ప్లాంటేషన్ పనులను ప్రారంభించారు. మద్దుకూరు గ్రామానికి చెందిన సుమారు వందమంది పైగా పోడు సాగుదారులు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తున్న జెసిబి ని అడ్డుకున్నారు. దీంతో పోడు దారులకు ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పోడు సాగు దారులు మాట్లాడుతూ.. 2000 సంవత్సరం నుండి పోడు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని. ఇప్పటివరకు ఏ ఫారెస్ట్ అధికారులు తమను అడ్డుకోలేదన్నారు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్వో పట్టాలు ఇస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, శాఖల సమక్షంలో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారని ఆ సమయంలో పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తమ భూముల్లోకి బలవంతంగా వచ్చి ప్లాంటేషన్ పనులను నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. 

ఇదే విషయంపై ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ను వివరణ కోరగా 2010 తర్వాత నరికిన పోడును మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. పోడు వ్యవసాయం పేరుతో కొంతమంది గిరిజనులతో అడవిలో చెట్టు నరికించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. దీనికి కొంత మంది పెద్దల అండదండలు అందించడంతో ఈ వ్యవహారం కొనసాగుతుందన్నారు. ఏది ఏమైనా జిల్లా ఫారెస్ట్ అధికారుల సూచనల మేరకు అడవుల సంరక్షణలో భాగంగా ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తామని తెలిపారు.

Share it:

TS

Post A Comment: