ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
మండలం లోని వలస ఆదివాసీ సాకివాగు గ్రామంలోని ఏ.ఎస్.డి.ఎస్ నిర్వహిస్తున్న బ్రిడ్జి స్కూల్ విద్యార్థుల కు ఏ.ఎస్.డి.ఎస్ మరియు కింగ్స్ కాలేజ్ లండన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో టీనా దిలీప్, హెచ్.ఎస్ మీనా ఐఏఎస్, సోమరాజు దొండు ల సహకారంతో స్కూల్ బ్యాగులు,నోట్ బుక్స్, చైల్డ్రెన్స్ సైకిళ్ళు పంపిణీ చేశారు.ఈ రోజు సాకివాగు గ్రామాన్ని ఏ.ఎస్.డి.ఎస్ పౌండర్ అండ్ డైరెక్టర్ ఉండవల్లి గాంధీ బాబు, కింగ్స్ కాలేజ్ లండన్,ఎస్ ఉయ్ కెన్ ఆర్గనేజేషన్ వారు సందర్శించటం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలలకు సరైన విద్యను అందించినప్పుడే వారి భవిషత్తు బాగుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కింగ్ కాలేజ్ లండన్ సభ్యులు స్టీవెన్,నళిని,సాగర్,కావ్య, చైల్డ్ లైన్ 1098 జిల్లా సమన్వయకర్త రాజ్ కుమార్,రాచన్నగూడెం సర్పంచ్ కొర్సా గణపతి,బషీర్, రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: