CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా మహాసభను జయప్రదం చేయండి.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభను ఏప్రిల్ 11 న ఇల్లందు మండలం కొమరారంలో ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నామని

ఈ సభకు జిల్లాలోని కళాకారులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈరోజు ఇల్లందు మండలం మర్రిగూడెం,ఎల్లాపురం లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకులు కోడి శ్రీరాములు, యనగంటి చిరంజీవి లు మాట్లాడుతూ..  

1976 సంవత్సరంలో అమరుడు కామ్రేడ్ కానూరి తాత సారథ్యంలో ఆవిర్భవించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాటి నుండి నేటి వరకు అనేక ప్రజా సమస్యలపై తమ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తుందని,ముఖ్యంగా సారా వ్యతిరేక ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా, ఫారెస్ట్ పట్వారీల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, రైతాంగ సమస్యలపై, పోడు భూములకు పట్టాల కొరకై, అధిక ధరలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై,వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దుకై జరిగిన అనేక ప్రజా పోరాటాల్లో తన గళం విప్పి గజ్జకట్టి ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్య పరచడంలో ముఖ్య భూమికను పోషించిందని అన్నారు. నూతన ప్రజాస్వామ్య విప్లవ లక్ష్యసాధన కోసం భూమి భుక్తి విముక్తి పోరులో అమరులైన అనేకమంది అమరవీరులను తన పాటతో బ్రతికేస్తూ స్పూర్తిదాయకంగా నిలిచినదని అన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు దోపిడీ పాలకులు సామ్రాజ్యవాద విష సంస్కృతిని పెంచి పోషిస్తూ ప్రజా సంస్కృతిని దెబ్బతీసే విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. అర్ధనగ్న,అశ్లీల చిత్రాలు ప్రదర్శిస్తూ, ద్వందర్ధ సాహిత్యాన్ని ప్రజలపై రుద్దుతూ సమాజాన్ని చెడగొడుతున్నారని, సామ్రాజ్యవాద 

విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతూ,

ప్రజా సంస్కృతి ప్రజా కళలను కాపాడుకునే విధంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కృషి చేస్తుందనిఅన్నారు. అనేక ఆటుపోట్లను ఒడిదొడుకులను నిర్మాణ సమస్యలను సంస్థ ఎదుర్కొంటున్న ఈ తరుణంలో నిర్మాణాన్ని పటిష్ట పరచుకొనుటకు, గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుటకు నిర్వహిస్తున్న

అరుణోదయ మహాసభలకు ముఖ్య వక్తలుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరకాల నాగన్న, రాయి కృష్ణ నాయకులు బొగ్గారపు వెంకన్న 

లు హాజరవుతారని కావునా జిల్లాలోని కళాకారులు కళాభిమానులు,మేధావులు హాజరై మహాసభను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు జోగ కాంతారావు, కాంపాటి జీవన్, పూనెం సత్యం, ఎట్టి నర్సింహారావు, ఎనగంటి లాజర్, జోగ రమేష్, రామనాధం,రామూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: