CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈనెల ఏడో తారీఖున ములుగు జిల్లా కేంద్రంలో రాస్తారోకో మహా ధర్నా ను విజయవంతం చేయండి.

Share it:

 


  • జాతీయ రహదారి దిగ్బంధం.
  • రైతుల కోసం టీఆర్ఎస్ యుద్ధం.
  • చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చెయ్యాలి. 

మన్యం మనుగడ ములుగు

ములుగు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్య కర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మొదటగా మండలఅధ్యక్షులు, ఎంపీపీ,జడ్పీటీసీలకు 

రైతు నిరసన దీక్షలు,కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దిశ నిర్దేశం చేశారు.అనంతరం మీడియాతో

మాట్లాడుతూ..యాసంగిలో వరి వెయ్యొద్దు అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పిలుపునిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి వరి పంట వెయ్యాలని రైతులను ఉసిగొలి పాడు.ఆరుగాలం పండించిన వరి పంట రైతు చేతికి వచ్చే సమయానికి ధాన్యం కొనడానికి ముందుకురాకుండా,మేము కొనం అని కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పాలుచేస్తున్నారని ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య అన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతుఅన్నల జీవితాలను రోడ్ల పాలు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని అన్నారు.అన్నము పెట్టె రైతు అన్నకు కులం మతం స్వార్ధం ఉండదని అన్నారు.

మతాలను కులాలను రెచ్చగొట్టే బీజేపీ పార్టీని దేశంలో ప్రజలు తరిమి కొట్టే సమయం ఆసన్న మైందని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక త్వంలో రైతుల కోసం రైతు బీమా,రైతు బంధు,ఉచిత 24 గంటల కరెంట్ అందిస్తు న్నామని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం పోరాటం ఆగదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బుద్ది వచ్చే వరకు యుద్ధం చేస్తామన్నారు.జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు

ఈనెల 7వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో,ధర్నా, నిరసన ప్రదర్శనలు కార్యక్రమా లు జరుగుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొంటారని అన్నారు.జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ప్రదర్శనకు రైతులు,

కార్యకర్తలు,నాయకులు భారీ సంఖ్యలో వచ్చి రైతుల కోసం కేంద్రం పైన యుద్ధం చెయ్యాలని,పిలుపునిచ్చారు.

వీరి వెంట జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ తుమ్మల హరిబాబు,సకినాల భవాని,గై రుద్రమదేవి అశోక్,కోఆప్షన్ రియాజ్ మీర్జా,ఎంపీపీలు గండ్ర కోట శ్రీదేవి సుదీర్,సుడి శ్రీనివాస్ రెడ్డి,బుర్ర రజిత సమ్మయ్య,గొంది వాణి శ్రీ,

జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మాడుగుల రమేష్,మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,

సూరపనేని సాయి బాబు,

లింగాల రమణ రెడ్డి,గడదాసు సునీల్ కుమార్,కుడుముల లక్ష్మీ నారాయణ,ఆత్మ చైర్మన్

దుర్గం రమణయ్య,రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,పోరిక గోవింద్ నాయక్,తహిర్ పాషా,కృష్ణ రెడ్డి,విజయ్ రామ్ నాయక్,

ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్ కుమార్,జిల్లా టీఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జి కునూరు అశోక్ గౌడ్,

కెశెట్టి కుటుంబ రావు,పిన్నటి మధుసూదన్ రెడ్డి,ముడతాన పల్లి మోహన్,అది రెడ్డి,తుమ్మ మల్ల రెడ్డి,బైకనిసాగర్,కందకట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Share it:

TS

Post A Comment: